వైసిపి ఎమ్మెల్యే సొంత పార్టీ పైనే నిప్పులు కురిపించారు. సంచలన విమర్శలు చేస్తూ, కబడ్దార్ కాస్కోండి అంటూ ఛాలెంజ్ విసిరారు. బోడి రాజకీయాలు అంటూ ఎద్దేవా చేసిన విధానం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ఆ నాయకుడు ఎవరు ఎందుకింతలా మండిపడుతున్నారు అంటే ? వైసిపి పార్టీ పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు తనకి మంత్రి వర్గంలో చోటు దక్కలేదు అన్న అసంతృప్తితో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ బోడి రాజకీయాలు నాకెందుకు ? ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ముందుకు వెళ్లాల్సిన పని నాకు లేదు. మంత్రి పదవి నాకు దక్కకుండా అధిష్టానం నన్ను దెబ్బకొట్టింది అంటూ నేరుగా సొంత పార్టీ పైనే విమర్శలు గుప్పించారు.

వాళ్ళు అంత తెలివిగా దెబ్బ కొడితే చూస్తూ కూర్చోను, నాకు టైం వస్తుంది నేను దెబ్బ కొడతా అంటూ ఫైర్ అయ్యారు. నేను అహింస వాదిని కాదు హింసా వాదిని పబ్లిక్ మీటింగ్ లో కూడా అందరి ముందు ఇంతే దైర్యంగా చెప్పగలను నాకు భయమే లేదు. కావాలంటే జైల్లో పెట్టుకోమనండి ఎవరు వస్తారో రమ్మనండి...!!  సిద్దంగా ఉన్నాను అంటూ కోపంతో ఊగిపోయారు. ఓ వాలంటీర్ల సన్మాన కార్యక్రమానికి విచ్చేసిన వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఈ విధంగా అధికార పార్టీ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఈయన తన అసంతృప్తిని తనదైన శైలిలో వ్యక్తం చేశారు అన్న విషయం ఒక వైపు అయితే.. ఇదే పాయింట్ ను పట్టుకుని ఇపుడు విపక్ష పార్టీలు అధికార పార్టీపై విమర్శలు వెదజల్లుతున్నాయి.

ఒక నాయకుడు సొంత పార్టీ పై ఈ రేంజ్ లో ఫైర్ అవ్వడం అంటే సాధారణమైన విషయం కాదు...మరి పార్టీ విలువలను నేతలు ఎంత వరకు నిలబెడుతున్నారు అన్నది ఇక్కడ బాగా తెలుస్తోంది అంటూ కామెంట్లు వినపడుతున్నాయి. అంతే కాకుండా ఒక గౌరవమైన పదవిలో ఉన్న ప్రజా ప్రతినిధి హింసా వాదిని అంటూ బహిరంగంగా చెబుతున్నారు అంటే అధికార పార్టీ వైసిపి వచ్చాక రౌడీయిజం ఎక్కువయ్యింది అన్న వ్యాఖ్యలకు ఇదే నిదర్శనం అని గుసగుసలాడుకుంటున్నారు. మరి ఒక నాయకుడు ఈ రకంగా సొంత పార్టీనే విమర్శిస్తూ దూకుడు చూపిస్తే అంతేమరి అంటున్నారు.








కూడా, అంతేకాదు తన సినిమాకు తానే డబ్బింగ్ చెప్పుకుంటారు ఈ అందాల తార.  గుండె జారిగల్లంతయింది, ఇష్క్, 24 ,
జబర్దస్త్ వంటి సినిమాల్లో సింగర్ గా పాటలు పాడారు నిత్య.

యుగానికొక్కడు చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఆండ్రియా ... అద్భుతమైన సింగర్ కూడా తన పాటలో ఉండే స్టైలే స్టైల్...  పాటను, బొమ్మరిల్లు లో ” వుయ్ హావ్ ఏ రోమియో” పాటను, దడ లో “దివాలి దీపాన్ని” సాంగ్ ని, అపరిచితుడు సినిమాలో “కన్నుమ్ కన్నుమ్ నోకియా” భరత్ అనే నేను సినిమాలో “ఇది కలలా ఉన్నదే..” సూపర్ హిట్ సాంగ్స్ కు  ఆండ్రియా వాయిస్ ఇచ్చారు.

మమత మోహన్ దాస్ టెలివిజన్ నుండి వెండి తెరకు వచ్చిన గొప్ప నటి. ఈమె మంచి సింగర్ కూడా... శంకర్ దాదా జిందాబాద్ లో ఆకలేస్తే అన్నం పెడతా సాంగ్, రాఖి టైటిల్ సాంగ్,  అదే విధంగా జగడం లో 36-26-24 అంటూ సాగే పాట ఈమె పాడారు ..ఇవి కాకుండా చాలా పాటలకు గాత్రం అందించారు మమత.

ఇలా కొందరు హీరోయిన్ లు నటులగానే కాకుండా సింగర్స్ గా కూడా తమ సత్తాను నిరూపించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: