గతంలో హైద్రాబాద్ లో ఉన్న ట్రాఫిక్ వలన ప్రతి ఒక్కరు కూడా ఉదయం ఆఫీస్ కి వెళ్ళాలి అన్నా లేక ఏదైనా కారణాల వలన అర్జెంట్ పని మీద బయటకి తొందరగా వెళ్ళాలి అన్నా అలాగే రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి చాలా దూరప్రాంతాల నుండి ఇంటి చేరుకోవాలని అన్నా కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఎప్పటికో చేరుకోవాల్సి వచ్చేది. కానీ హైదరాబాద్ లో మెట్రో ట్రైన్స్ వచ్చిన దగ్గర నుండి ప్రజలకు ఆ ఇబ్బంది కొంచెం తగ్గింది అని చెప్పవచ్చు ఎంత దూరం నుండి అయినా కేవలం 15 మినిట్స్ లేదా 30 మినిట్స్ లో చేరుకుంటున్నారు. అంతే కాదు మెట్రో వాళ్ళు ప్రజలపై మెట్రో చార్జీల భారం ఎక్కువ పడకుండా అనేక బెనిఫిట్స్ కూడా ఏర్పాటు చేసి ఇలా ఎన్నో ప్రయోజనాలను కల్పిస్తున్నారు.

తాజాగా ఇంకో ప్రయోజనాన్ని కూడా కల్పిస్తున్నారు మెట్రోలో వెళ్లే ప్రజలకు, మెట్రో స్టేషన్ కు దూరంగా ఇళ్ళు ఉన్నవాళ్లు తమ సొంత వాహనాలు ఉంటే వాటిలోనో లేక బయటి వాహానాలకు ఎక్కువ వెచ్చించి అందులోనే వచ్చి మెట్రోలో వెళ్లాల్సి ఉంటుంది. అయితే దీనితో ప్రజలు ఇబ్బందులు పడకూడదని భావించిన మెట్రో వాళ్ళు ప్రజలు మెట్రో  స్టేషన్‌కు చేరుకోవటానికి , అలాగే మెట్రో స్టేషన్‌ నుంచి ఇంటికి వెళ్లేందుకు మెట్రో రైడ్‌ పేరుతో కొత్తగా ఈ- ఆటో సేవలను ప్రారంభించింది. అయితే తాజాగా ఈ  గురువారం పరేడ్‌ గ్రౌండ్‌ స్టేషన్‌ పార్కింగ్‌లోని హెచ్‌ఎం ఆర్‌ఎల్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ అయినా ఎన్‌వీఎస్‌ రెడ్డి, ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్‌ సీఈవో అయినా ఎండీ కేవీబీ రెడ్డి, మెట్రోరైడ్‌ కో-ఫౌండర్‌ గిరిష్‌ నాగ్‌పాల్, అలాగే షెల్‌ ఫౌండేషన్‌ ప్రతినిధి అయినా తహసీన్‌ ఆలమ్, ఇంకా డబ్ల్యూ ఆర్‌ ఐ ఇండియా డైరెక్టర్‌ పవన్‌ కలిసి ఈ- ఆటో సేవలను కొత్తగా ప్రారంభించారు.

మరి ఈ సందర్భంగా హెచ్‌ఎం ఆర్‌ఎల్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ అయిన ఎన్వీఎస్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు మెట్రో స్టేషన్‌ చేరుకోవాలి అంటే  వారు ఉపయోగిస్తున్న ప్రైవేటు ఆటోల కంటే కూడా మెట్రో ఆటోల్లో చార్జీలు చాలా తక్కువగా ఉంటాయి అని అన్నారు. అంతే  కాదు మొదటి కిలోమీటర్‌ పరిధి వరకు పది రూపాయల చార్జులు అటు తర్వాత ప్రతి ఒక్క కిలో మీటరుకు ఆరు రూపాయల చొప్పున చార్జీలు ఉంటాయి అని  చెప్పారు. ఇక ఆటోను బుక్‌ చేసుకోవటానికి అయితే మాత్రం మెట్రో రైడ్‌ ఇండియా అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అయితే మెట్రో సంస్థపైన కొందరు పని గట్టుకుని మరి విమర్శలు కురిపిస్తున్నారని, అలాగే  ఫేజ్‌- 2లో భాగంగా మన శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ వరకు కచ్చితంగా మెట్రో రైలు సేవలు ఉండేలా  రూ.5 కోట్ల వరకు వ్యయంతో  ప్రణాళికలు కూడా సిద్ధంగా ఉన్నాయని ఇక ఆ పనులు ప్రారంభించటమే ఆలస్యం అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: