ఎబోలా.. ఇదో రకం వైరస్‌ వ్యాధి.. ఇది కూడా గతంలో లక్షల ప్రాణాలు హరించిన మహమ్మారి. అలాంటి ఎబోలా మహమ్మారి మరోసారి ఆఫ్రికా ఖండంలోని కాంగోలో విస్తరిస్తోంది. కాంగోలో ఎబోలా వ్యాప్తి మళ్లీ మొదలైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కాంగోలోని ఈక్వెటర్‌ ప్రావిన్స్‌లోని మబండకా అనే పట్టణంలో ఎబోలా కేసు ఇటీవల నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ  తెలిపింది. 31 ఏళ్ల రోగిలో ఏప్రిల్‌ 5వ తేదీన ఎబోలా లక్షణాలు కనిపించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఆ రోగి ఏప్రిల్‌ 22న మరణించాడని ప్రపంచ ఆరోగ్య సంస్థ  తెలిపింది.


అంతే కాదు.. ఎబోలా వచ్చిన రోగికి చికిత్స చేసిన వైద్య సిబ్బందిలోనూ ఎబోలా లక్షణాలు కనిపించాయట. దీంతో ఆ వైద్యులు కూడా పరీక్షల కోసం నమూనాలను ఇచ్చారు. అయితే.. ఈ ఎబోలాను ఎదుర్కోవడంలో కాంగోకు తగినంత అనుభవం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఎందుకంటే.. కాంగోలోని ఈక్వెటర్‌ ప్రావిన్స్‌లో ఎబోలా ప్రబలడం ఇది కొత్తేమీ కాదు.. గత నాలుగేళ్లలో ఎబోలా స్థానికంగా వ్యాప్తి చెందడం ఇది మూడోసారి.


మొత్తం కాంగో చరిత్రలో 1976 నుంచి ఇప్పటి వరకూ 14 సార్లు ఎబోలా వ్యాపించిందట. అయితే తాజాగా  రెండు వారాల క్రితమే కాంగోలో ఎబోలా వ్యాప్తి ప్రారంభమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆఫ్రికా విభాగం రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మత్సడిషో మోతీ చెబుతున్నారు. ఆరంభంలోనే దాన్ని అదుపు చేసేందుకు తగిన చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు.


అయితే.. కాంగోలో ఎబోలా కేసులు పెరగడంపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కనిపిస్తోంది. ఇప్పటికే కరోనా నాలుగో వేవ్ భయాలతో ప్రపంచం సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కొత్త వైరస్ గోలేమిట్రా బాబూ అనుకుంటున్న దేశాలే ఎక్కువ. అయితే.. ఈ ఎబోలా గురించి అంతగా భయపడాల్సిన పని లేదని  ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఇది ఆఫ్రికా దేశంలోనే ఎక్కవగా కనిపిస్తుందని.. మిగిలిన దేశాల్లో దీని ప్రభావం తక్కువేనని చెబుతోంది. కాంగోలో ఎబోలాపై ఇండియా కూడా స్పందించింది. ఎబోలాను అదుపు చేయడంలో కాంగోకు ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ అనుభవం ఉందని భారత్ వ్యాఖ్యానించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: