ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా తెరాస 21వ ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో తెరాస ఆవిర్భావ వేడుకలు జరుగుతాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహణకు తెరాస ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలకు 3 వేల మందికి పైగా పార్టీ ప్రతినిధులు హాజరుకానున్నారు. తెరాస ప్లీనరీకి వచ్చేవారికి ఇప్పటికే ప్రత్యేక పాస్‌లు జారీ చేశారు.  ప్లీనరీ సందర్భంగా ఎల్ఈడీ స్క్రీన్లతో భారీ వేదిక ఏర్పాటు చేసారు. ఉదయం 10 నుంచి 11 వరకు తెరాస ప్రతినిధుల నమోదు కార్యక్రమం ఉంటుంది.


ఉదయం 11.05 గం.కు అమరవీరులకు కేసీఆర్‌ నివాళులర్పిస్తారు. ఆ తర్వాత తెరాస జెండా ఆవిష్కరిస్తారు. కేసీఆర్‌ స్వాగత ఉపన్యాసంతో కార్యక్రమం ప్రారంభం అవుతుంది. తెరాస ప్లీనరీలో 11 అంశాలపై చర్చలు, తీర్మానాలు ఉంటాయి. జాతీయ రాజకీయాలే కేంద్రబిందువుగా ప్లీనరీ జరగబోతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యామ్నాయ కూటమిపై కేసీఆర్‌ స్పష్టత ఇవ్వొచ్చని భావిస్తున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ స్పష్టత ఇవ్వొచ్చని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.  అలాగే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయనున్నట్లు సమాచారం ఉంది. ఈ సాయంత్రం 5 గంటలకు ముగిుస్తుంది.  


తెరాస ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ గులాబీమయంగా మారింది. హైదరాబాద్‌లోని కూడళ్లలో కేసీఆర్, కేటీఆర్ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు. హైటెక్స్‌ పరిసరాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. తెరాస ప్లీనరీ సందర్భంగా 2500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. తెరాస ప్లీనరీ జరిగే ప్రాంతంలో 200 సీసీ కెమెరాలతో నిఘా.. సీసీటీవీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశారు. ప్లీనరీకి వచ్చే రోడ్లలోని సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తారు.


తెరాస ప్లీనరీ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. పలు మార్గాల్లోని కార్యాలయాలకు ట్రాఫిక్‌ పోలీసుల సూచనలు అంద జేశారు. పనివేళల్లో స్వల్ప మార్పులు చేసుకోవాలని కార్యాలయాలకు సూచించారు. హైటెక్స్-కొత్తగూడ మార్గాల్లో.. సైబర్ టవర్స్-ఐకియా రోటరీ మార్గాల్లో.. గచ్చిబౌలి నుంచి కొత్తగూడలోని కార్యాలయాలకు సూచనలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: