నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ ఫ్రంట్ పెట్టాలని చాలా ప్రయత్నించారు. కొందరు ముఖ్యమంత్రులను వ్యక్తిగతంగా కలిసి సమావేశాలు కూడా నిర్వహించారు. నరేంద్రమోడి సర్కార్ పై యుద్ధమన్నారు. ఢిల్లీలో భూకపంమన్నారు. అంతాచేసి చివరకు రావాల్సింది రాజకీయ ఫ్రంటులు కాదని, జరగాల్సింది రాజకీయ పునరేకీకరణ కాదని తేల్చేశారు. ఇదంతా ఎవరయ్యా తేల్చేసిందంటే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.





బుధవారం జరిగిన పార్టీ ప్లీనరీలో కేసీయార్ మాట్లాడుతు పైన చెప్పిన ఆణిముత్యాలను విసిరేశారు. ఇంతకీ కేసీయార్ చెబుతున్నదేమిటయ్యా అంటే ప్రత్యామ్నాయ అజెండా కావాలట. ప్రత్యామ్నాయ అజెండా ఏమిటంటే మళ్ళీ ఆ విషయం మాత్రం చెప్పలేదు. కేసీయార్ ఎప్పుడూ ఇంతే ఏ విషయం కూడా మొదట్లో సరిగా చెప్పరు. మొదట్లో ఒక ముక్క చెప్పి వదిలేస్తారు. ఆ ముక్కేమిటో అర్ధంకాక జనాలు తన్నుకుచస్రు. తర్వాతెప్పుడో దానిపై పూర్తిగా మాట్లాడుతారు.





ఇంతకాలం కేంద్రప్రభుత్వంపై యుద్ధమని, మూడో ఫ్రంటని, ఢిల్లీలో భూకంపమని ఎందుకన్నారో ఆయనకే తెలియాలి. చూడబోతే ఏదీ వర్కవుటైనట్లు లేదు. అందుకనే చప్పుకుచేయకుండా కూర్చున్నారు. మళ్ళీ ఇంతకాలానికి ప్లీనరీ సందర్భంగా ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండా కావాలని మొదలుపెట్టారు. పైగా గద్దెపై కూర్చోవాల్సింది రాజకీయపార్టీలు కాదట ప్రజలట. ఈ మాటకు అర్ధం ఏమిటో తెలీక జనాలు అప్పుడే జుట్టు పీక్కోవటం మొదలుపెట్టారు.





కేసీయార్ చెప్పిందే నిజమైతే మరి గద్దెమీద తానెందుకు కూర్చున్నారు ? టీఆర్ఎస్ గెలిచిన తర్వాత ఎవరో ఒకరిని గద్దెమీద కూర్చోబెట్టచ్చు కదా ? మళ్ళీ ఆ పనిమాత్రం  చేయరు. ఇపుడు మాట్లాడిన మాటలకు మళ్ళీ ఎప్పుడో వివరణిస్తారు. అంతవరకు ఎదురుచూస్తు కూర్చోవటం తప్ప చేసేదేమీలేదు. ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండా అంటే ఏమిటో కూడా చెప్పలేదు. సరే పనిలో పనిగా నరేంద్రమోడిపై దుమ్మెత్తిపోయటమే కాకుండా తన నేతలతో కూడా దుమ్ము పోయించారు. తన గురించి గొప్పగా చెప్పుకోవటం, ప్రత్యర్ధులను తిట్టడం కోసమే ప్లీనరీ జరిగినట్లుంది. జాతీయస్ధాయిలో తనను ఏ పార్టీకూడా నమ్మటం లేదన్నది వాస్తవం. అందుకనే అర్ధంకాకుండా ఏమిటేమిటో మాట్లాడారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: