ఒక రాష్ట్రంలోని అసెంబ్లీ సీట్లలో నూటికి నూరుశాతం ఏ పార్టీకి రావు. నిజానికి మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన సీట్లు రికార్డనే చెప్పాలి. మొత్తం 175 సీట్లకు గాను వైసీపీకి 151కి రావటం చాలా రేరనే చెప్పాలి. అలాంటి రేర్ ఫీట్ మళ్ళీ రిపీట్ కావాలని లేదా అంతకన్నా ఎక్కువ రావాలని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. జగన్ చెప్పింది జరగాలంటే నిజంగా అద్భుతం జరగాల్సిందే.






అయితే ఇక్కడే అందరికీ ఒక డౌటు మొదలైంది. రెండోసారి అధికారంలోకి రావటంలో మెజారిటి నేతలకు ఎలాంటి అనుమానాలు లేవు. ఆమధ్య జగన్ చేయించుకున్న సర్వేలో కూడా 120-130 సీట్ల మధ్యలో మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తుందని రిపోర్టు వచ్చిందట. ఓకే ఆ రిపోర్టు రీజనబుల్ గానే ఉందని అందరు అనుకున్నారు. ప్రతిపక్షాల ప్రస్తుత పరిస్ధితులను దృష్టిపెట్టుకుని చూస్తే వైసీపీ రెండోసారి అధికారంలోకి వస్తుందని మెజారిటి అనుకుంటున్నదే.






అంతేకానీ తిరిగి 151 సీట్లు గెలుచుకుంటుందని మాత్రం చాలామంది అనుకోవటంలేదు. అలాంటిది జగన్ ఏకంగా ముందు 151 సీట్లు తెచ్చుకోవాల్సిందే అనిచెప్పి వెంటనే 151 సీట్లు తెచ్చుకునేపక్షంలో 175 సీట్లూ ఎందుకు గెలవం అంటూ నేతలను ప్రశ్నించారు. ఇక్కడే అందరిలో జగన్ మాటపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే క్షేత్రస్ధాయిలో ప్రభుత్వం, వైసీపీతో పాటు ప్రతిపక్షాల వాస్తవ పరిస్ధితులపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) ఇప్పటికే రిపోర్టు ఇచ్చారట.






అందులో సంక్షేమ పథకాల అమలు విషయంలో మెజారిటి జనాలు పూర్తిస్ధాయిలో సంతృప్తిగా ఉన్నట్లు తేలిందట. ఇదే సమయంలో కొందరు ఎంఎల్ఏల మీద మాత్రం జనాల్లో అసంతృప్తి ఉందని అలాంటి వాళ్ళని మార్చాల్సిందే అని చెప్పారట. ఇదే సమయంలో గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్ల సేవల విషయంలో జనాల్లో పూర్తిస్ధాయి సంతృప్తిగా ఉన్నట్లు రిపోర్టు వచ్చిందట. ఇదే సమయంలో ప్రతిపక్షాల పరిస్ధితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నదని చెప్పారట.  ప్రత్యేకంగా కుప్పంలో పరిస్ధితిపైన కూడా నివేదిక ఇచ్చారట. అందుకనే జగన్ పదే పదే కుప్పం గురించి మాట్లాడుతోంది. మరీ రెండేళ్ళల్లో ఏమైనా మార్పులొస్తాయేమో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: