వచ్చే ఎన్నికల్లో ఎలాగైనాసరే కుప్పంలో చంద్రబాబునాయుడు ఓడించాలని జగన్మోహన్ రెడ్డి మహా పట్టుదలతో ఉన్నారు. ఎనిమిది ఎన్నికల్లో వరుసగా కుప్పం నుండి గెలుస్తున్న చంద్రబాబును ఓడించటం వైసీపీకి సాధ్యమేనా ? చిత్తూరు జిల్లాలో ఒకమూలకు విసిరేసినట్లుండే కుప్పం జిల్లా మొత్తంమీద అత్యంత వెనుకబడిన నియోజకవర్గం. ఇక్కడి జనాభాలో బీసీలు, ఎస్సీలే ఎక్కువమంది. ఏపీ-కర్నాటక-తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులకు మధ్యలో ఉంటుందీ నియోజకవర్గం.





ఇలాంటి నియోజకవర్గాన్ని చంద్రబాబు ఎంచుకోవటమే చాలా వ్యూహాత్మకం. ఎందుకంటే ఇక్కడ జనాలకు పట్టణ, నగరం వాసన అప్పట్లో అంటే 1989 ప్రాంతంలో ఇంకా తగల్లేదు. జనాల్లో అత్యధికులు అమాయకులే కాబట్టి కుప్పాన్ని చంద్రబాబు ఉంచుకున్నారు. మరప్పటికే చంద్రబాబు మాయోపాయోల్లో గట్టివాడు కదా. పైగా పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎన్టీయార్ కు స్వయాలా అల్లుడు. చంద్రబాబు తెలియకపోయినా ఎన్టీయార్ అందరికీ తెలిసిన మహానటుడు కాబట్టి చంద్రబాబును కూడా అక్కడి జనాలు నెత్తిన పెట్టుకున్నారు.





1989లో మొదలైన చంద్రబాబు ప్రయాణం ఇంకా సాగుతునే ఉంది. చంద్రబాబు బలం ఏమిటంటే ప్రత్యర్ధుల బలహీనతే. స్వయం ప్రకాశంలేని చంద్రబాబు ప్రత్యర్ధుల బలహీనతలను పట్టుకోవటం, వాటిని పట్టుకుని ఆడించటంలో  ఆరితేరిపోయున్నారు. అప్పట్లో రెండుపార్టీలే ఉండేవి కాబట్టి కాంగ్రెస్ నేతలందరినీ ఏదోరూపంలో లోబరుచుకున్నట్లు అప్పట్లోనే కాంగ్రెస్ లో ఆరోపణలుండేవి. ఎన్నిక ఏదైనాసరే టీడీపీకి ఎదురులేకుండా గెలిపించుకోవటంలో ప్రత్యర్ధులను లోబరుచుకోవటమే కీలకమైంది.





1994లో ఘన విజయం తర్వాత ఏడాదికి ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీతో పాటు పార్టీని కూడా లాగేసుకున్న తర్వాత కుప్పంలో మరింతగా బలపడిపోయారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంగా మారిపోవటంతో కుప్పాన్ని కాంగ్రెస్ నేతలు పెద్దగా పట్టించుకోలేదు. అప్పటినుండి కుప్పంలో తనకు ఎదురేలేదన్నట్లుగా తయారుచేసుకున్నారు.  ఎప్పుడు ఎన్నిక జరిగినా బంపర్ మెజారిటితోనే చంద్రబాబు గెలిచేవారు.





చంద్రబాబుకు వచ్చే మెజారిటిలో ఎక్కువ భాగం దొంగఓట్లే అనే ఆరోపణలు కూడా ఉండేవి. ప్రత్యర్ధులను ఏ స్ధాయిలో లొంగదీసుకునేవారంటే పోలింగ్ రోజున చివరకు పోలింగ్ ఏజెంట్లు కూడా లేరనేట్లుగా మ్యానేజ్ చేసుకునేవారనే ఆరోపణలున్నాయి. మొత్తానికి పద్దతి ఏదైనా ఎనిమిదిసార్ల నుండి కుప్పంలో చంద్రబాబు గెలుపు రహస్యమిదే. అలాంటిది మొదటిసారి 2019 ఎన్నికలో చంద్రబాబు హవాకు కాస్త బ్రేకులుపడ్డాయి. అప్పటినుండే చంద్రబాబును ఓడించటం కష్టంకాదని జగన్ మొదలుపెట్టారు. మరి వచ్చే ఎన్నికల్లో ఏమవుతుందో చూడాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: