ఏపీలో రోడ్లు, నీరు, కరెంటు సరిగ్గా లేదన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఖండించారు. కేటీఆర్ అయినా ఎవరైనా మాట్లాడే ముందు వాళ్ల రాష్ట్రం గురించి మాట్లాడాలని సూచించారు. ఆ  ఆ తర్వాతే ఇతరుల గురించి మాట్లాడాలని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆస్తుల పంపకాలు ఇంకా పూర్తిగా జరగలేదన్న సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇంకా  సుమారు 50 నుంచి 60 వేల కోట్ల ఆస్తులు విభజన జరగాల్సి ఉందని గుర్తు చేశారు.


ఏపీకి అసలు కేపిటల్ లేకుండానే విభజన చేశారని.. దీని వల్ల చాలా సమస్యలు ఉన్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అంటున్నారు. అధిక వర్షాల వల్లే రాష్ట్రంలో  రోడ్లు దెబ్బతిన్నాయని సజ్జల అన్నారు. అయితే.. తెలంగాణ లోనూ రోడ్లు బాగాలేవన్న సజ్జల... మొన్నటి వరకు తెలంగాణ లోనూ విద్యుత్ కోతలున్నాయని గుర్తు చేశారు. ఏపీ రాష్ట్ర ప్రజలకు అన్ని విషయాలు తెలుసని.. వారి ఆమోదమే తమకు శిరోధార్యమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.


నాలుగు భవనాలు కడితే.. అది అభివృద్ధి కాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి గుర్తు చేశారు. ఆ మాటకొస్తే.. అసలు హైదరాబాద్‌లో ఈ కేసీఆర్ సర్కారు కొత్తగా చేసిందేమీ లేదని.. ఔటర్ రింగ్ రోడ్డు, పీవీ ఎక్స్ ప్రెస్ వే వంటివి వైఎస్ హయాంలోనే వచ్చాయని గుర్తు చేశారు. ఆ అభివృద్ధిని కేసీఆర్ కొనసాగిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.


అభివృద్ధికి అసలైన నిర్వచనం.. రాష్ట్రంలోని అన్నివర్గాలు అభివృద్ధి చెందడం అని.. ఈ మాటకొస్తే.. దేశంలోని ఏ రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్‌ కు ఈ విషయంలో సాటి రాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇక గుంటూరు జిల్లాలో యువతిని చంపిన  నిందితుడికి  దిశ చట్టం తెచ్చిన స్పూర్తితో ఉరిశిక్ష పడిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.  దిశ చట్టంపై చేస్తున్నవన్నీ రాజకీయ విమర్శలేనని.. దిశ చట్టంపై  విమర్శలు చేస్తోన్న వారికి కోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: