ఈమధ్య జరిగిన ఓ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతు వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లూ తెచ్చుకోవాలన్నారు. కుప్పంలో స్ధానికసంస్ధల ఎన్నికల్లోను మున్సిపల్ ఎన్నికల్లోను వైసీపీ క్లీన్ స్వీప్ చేసినపుడు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చంద్రబాబునాయుడును ఎందుకు ఓడించలేమనే లాజిక్ వినిపించారు. కుప్పంలో చంద్రబాబునే ఓడించగలిగినపుడు మిగిలిన 174 నియోజకవర్గాల్లో టీడీపీని ఓడించటం ఒకలెక్కా అన్నట్లుగా జగన్ మాట్లాడారు.





ఓకే ప్రత్యర్ధిపై మైండ్ గేమ్ మొదలుపెట్టినపుడు ఎవరైనా ఇలాగే మాట్లాడుతారు. ప్రత్యర్ధిని ముందు మానసికంగా దెబ్బ కొట్టగలిగితే తర్వాత ఎన్నికల్లో కూడా ఓడించటం సులభమే అన్న పద్దతిలోనే ఉంటుంది మైండ్ గేమ్. అయితే జగన్ ఇక్కడ మరచిపోయిన విషయం ఒకటుంది. అదేమిటంటే కుప్పంలో చంద్రబాబు గడచిన ఏడు ఎన్నికల్లో గెలుస్తున్నట్లే వరుసగా టీడీపీ గెలుస్తున్న నియోజకవర్గాలు ఇంకా ఉన్నాయి.





కుప్పంలో ప్రత్యర్ధులను లొంగదీసుకుని చంద్రబాబు గెలుస్తున్నారనే ఆరోపణలు కొత్తేమీకాదు. అయితే ప్రత్యర్ధులపై ఒకవైపు ఫైట్ చేస్తునే మరోవైపు పోల్ మ్యానేజ్మెంట్ ద్వారా గెలుస్తున్నవి, అభిమానంతో జనాలు ఓట్లేస్తున్న నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిల్లో శ్రీకాకుళంలో కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి. అనంతపురం జిల్లాలో హిందుపురం నియోజకవర్గాల్లాంటివి ఇంకా ఉన్నాయి. గడచిన ఎనిమిది ఎన్నికల్లో హిందుపురంలో టీడీపీ ఓడిందే లేదు.





టెక్కలిలో గడచిన ఎనిమిది ఎన్నికల్లో ఎక్కువసార్లు టీడీపీ గెలిచింది. ఇక్కడ అచ్చెన్న బలమైన నేతనే చెప్పాలి. ఇలాంటి బలమైన నేతలు టీడీపీకి ప్రతి జిల్లాలోను కనీసం ఇద్దరు ముగ్గున్నారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లొచ్చాయంటే అందుకు చంద్రబాబు మీద జనాల్లో పేరుకుపోయిన కసే కారణం. అలాంటిది వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మళ్ళీ 151 సీట్లు రావాలంటే చంద్రబాబుపై జనాల్లో ఉన్న కసిని మించి జగన్ పై జనాల్లో అభిమానం ఉంటేనే సాధ్యం. జగన్ 175 సీట్లని చెప్పినా అసలు ఉద్దేశ్యం 151 గెలవటమే అయ్యుండచ్చు. కాబట్టి మళ్ళీ 151 సీట్లు గెలవాలంటే కుప్పం లాంటి అనేక సీట్లపైన జగన్ గురిపెడితేనే సాధ్యముంతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: