ఇప్పుడు ప్రభుత్వాలు కొత్త కొత్త నియమాలను అందుబాటు లోకి తెస్తున్నాయి. అయితే ఈ నియమాలను కొందరు పాటిస్తుంటే చాలా వరకు ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ పోతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలకు ఇచ్చే లైసెన్స్ విషయంలో చాలా రూల్స్ ఇప్పటికే ఉండడం వలన అందరూ లైసెన్స్ ను పొందడం కష్టం గా మారుతోంది. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ట్రాఫిక్ పోలీసులకు దొరికారో ఇక మీకు క్షవరమే.. లైసెన్స్ లేకపోతే జరిమానాలు వేస్తారు పోలీసులు. అయితే మరి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడపడం కూడా తప్పే కదా.. అయితే డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే  రవాణా శాఖ కార్యాలయం దగ్గర గంటల తరబడి వేచి చూడటం, డ్రైవింగ్ టెస్టు అంటూ చాలానే నియమాలు మరియు నిబంధనలు ఉన్నాయి.

కానీ అవన్నీ ఒకప్పుడు ఇపుడు కొత్త నిబంధనలు వాహనదారులకు ఊరట కలిగించే విధంగా రూపుదిద్దుకున్నాయి. ఆ వివరాలు ఇదిగో ఇలా ఉన్నాయి. ఈ మేరకు వాహనదారులకు శుభవార్త అందించింది కేంద్ర ప్రభుత్వం.  డ్రైవింగ్ లైసెన్స్ జారీకి సంబంధించిన కొత్త నిబంధనలు 2022, జూలై 1వ తేదీ నుండి అమలు లోకి రానున్నట్లు పేర్కొంది. దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అయిన లేదా  ఆయా రాష్ట్రాల రవాణా శాఖలు అయిన పలు ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్స్ ను ఏర్పాటు చేయనున్నాయి. కాగా  ఈ శిక్షణా కేంద్రాలలో ట్రైనింగ్ చేసి ఉత్తీర్ణులై ఆ సర్టిఫికెట్ అందుకుంటే చాలు. ఇక వారికి డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేస్తారు.  ఇవి ఐదేళ్ల పాటు చెల్లుబాటులో ఉంటాయి.  

డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుకు కావాల్సిన డాక్యుమెంట్స్:

డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌ కొరకు జనన ధృవీకరణ పత్రం/అలాగే పాస్‌పోర్ట్/పాన్ కార్డ్.

అడ్రెస్ ప్రూఫ్‌ కొరకు రేషన్ కార్డ్/పాస్‌పోర్టు/ఆధార్ కార్డు అవసరం అవుతాయి.

పాస్‌పోర్ట్ సైజు ఫోటో కూడా ఇవ్వాలి.

ఫారమ్‌ 1, 1A. 

మరింత సమాచారం తెలుసుకోండి: