ప్రతిపక్షాలను తిట్టేవారికి, ముఖ్యంగా టీడీపీకి కౌంటర్లిచ్చేవారికి మంత్రి పదవులిచ్చారనే ప్రచారం ఇప్పుడు జోరందుకుంది. ఇటీవల మంత్రి పదవులు దక్కనివారిని సీఎం జగన్ ప్రత్యకంగా పిలిపించుకుని మాట్లాడుతున్నారు. అలాంటి వారితో ఈ చర్చలు జరిగినట్టు టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం జరుగుతోంది. మంత్రిమండలిలో చోటు దక్కని ఎమ్మెల్యేలతో సీఎం జగన్ ఇటీవల చర్చలు జరుపుతున్నారు. కచ్చితంగా పదవి వస్తుందని ఆశించి భంగపడినవారిని నేరుగా ఆయనే సముదాయిస్తున్నారు. ఇప్పటికే ఇలా దాదాపు 15మందికి కౌన్సెలింగ్ ఇచ్చారని, వారిని బుజ్జగించారని, వారికి భవిష్యత్ బోధించారనే ప్రచారం జరుగుతోంది. క్యాంపు కార్యాలయానికి పిలుపించుకుని జగన్ మాట్లాడుతున్నారట. అయితే ఈచర్చల్లో పలు ఆసక్తికర అంశాలు వినిపిస్తున్నాయని కూడా కథనాలు వస్తున్నాయి.

మంత్రి మండలిలోకి తీసుకుంటే మీపై మిగతావారికి ఈర్ష్య పెరుగుతుందని, అందుకే అలా చేయలేదని కొందరికి చెబుతున్నారట జగన్. ఇక మిగతావారికి వారి సొంత నియోజకవర్గాలను జిల్లా కేంద్రాలుగా ఉంచాం కదా అనే మాట చెబుతున్నారట. అంటే జిల్లా కేంద్రాలను ఇవ్వడంలో కూడా ఈ రాజకీయ కోణం ఉందా అని ఆశ్చర్యపోయేలా ఉన్నాయి ఆ కథనాలు. కానీ జిల్లా కేంద్రం ఎక్కడో ఓ చోట పెట్టాల్సిందే. అలాంటి చోట ఉన్న నాయకులకు నేరుగా ఆ మాట చెబితే ఇక కిక్కురుమనకుండా ఉండగలరు. అందుకే వారికి అలా చెబుతున్నారట సీఎం జగన్.

మరికొంతమందికి మీరు టీడీపీపై గట్టిగా మాట్లాడటంలేదని కూడా చెబుుతున్నారట జగన్. ప్రభుత్వంపై, మనపై విమర్శలు చేస్తున్నవారికి బదులివ్వాలి కదా, ఘాటుగా స్పందించాలి కదా, అది మీనుంచి కవైందని అంటున్నారట. అలా మెత్తగా ఉంటే, మంత్రి మండలిలోకి వచ్చినా కూడా అలాగే ప్రవర్తిస్తారు కదా, అప్పుడు పదవులకు అర్థం ఉండదు కదా అంటున్నారట. అంటే టీడీపీని, ప్రతిపక్షాలను తిట్టినవారికే మంత్రి మండలిలో చోటు అనే అర్థం వచ్చేలా జగన్ మాట్లాడినట్టు ఆయా కథనాల సారాంశం. అదే నిజమైతే.. గతంలో మంత్రులుగా పనిచేసిన పేర్ని నాని, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ టీడీపీని గట్టిగా విమర్శంచేవారు. అలాంటి వారంతా మంత్రి పదవులు కోల్పోవడం విచిత్రమే. మరి ఈ కథనాల్లో ఎంతవరకు నిజముందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: