రాష్ట్రంలో రాజకీయం జగన్మోహన్ రెడ్డి వర్సెస్ ఎల్లోమీడియా అన్నట్లు అయిపోయింది. మామూలుగా అయితే వైసీపీ వర్సెస్ ప్రతిపక్షాలు లేదా జగన్ వర్సెస్ ప్రతిపక్షాలన్నట్లుగా ఉండాలి. అయితే అలాకాకుండా జగన్ వర్సెస్ ఎల్లోమీడియా లాగయిపోయింది. ఈ పరిస్ధితి ఎందుకు తలెత్తింది ? ఎందుకంటే జగన్ కు వ్యతిరేకంగా పోరాటాలు చేయటంలో ప్రతిపక్షాలన్నీ విఫలమైపోయాయి కాబట్టే.





జనాల్లో విశ్వసనీయత తగ్గిపోయిన చంద్రబాబునాయుడు, షూటింగ్ గ్యాపుల్లో మాత్రమే రాజకీయాలు చేసే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై పోరాటాలు చేయటం సక్సెస్ కాలేకపోతున్నారు. వీళ్ళమీదే అచ్చంగా రాజకీయాన్ని వదిలేస్తే దెబ్బపడిపోవటం ఖాయమని ఎల్లోమీడియాకు అర్ధమైపోయింది. పైగా జగన్ డైరెక్టుగానే ఎల్లోమీడియా, చంద్రబాబు, దత్తపుత్రుడిని కలిపి దుష్టచవుష్టయమని,  ఎల్లోమీడియాను ప్రత్యేకించి మారీచ-సుబాహులని పోల్చటంతో ఎల్లోమీడియా యాజమాన్యాలకు బాగా మండినట్లుంది.





ఇక్కడ అసలు విషయం ఏమిటంటే 2024 ఎన్నికల్లో జగన్ ఓడిపోవటం చంద్రబాబు కన్నా ఎల్లోమీడియాకే చాలా అవసరం. రేపటి ఎన్నికల్లో జగనే రెండోసారి కూడా గెలిస్తే ఎల్లోమీడియా యాజమాన్యాలకు ఇబ్బందులు తప్పవు. గెలిస్తే హ్యాపీనే అదే ఓడిపోతే చంద్రబాబుకు కొత్తగా జరిగే నష్టంఏమీలేదు. ఎందుకంటే చంద్రబాబు రాజకీయ జీవితం దాదాపు క్లైమ్యాక్సుకు వచ్చేసినట్లే.  ఏదో జగన్ మీద కసితో+లోకేష్ ను ఎలాగైనా సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలన్న ఏకైక టార్గెట్ తో రాజకీయాలు చేస్తున్నాంతే.





సో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావటానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించవని ఎల్లోమీడియాకు బాగా అర్ధమైపోయినట్లుంది. అందుకనే జగన్ ప్రభుత్వంపై వరుసబెట్టి ప్రతిరోజు నెగిటివ్ వార్తలు, కథనాలు వండివారుస్తు జనాల మైండ్ సెట్ మార్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తాము రాస్తున్న వార్తలు, కథనాలతో జనాల మైండ్ సెట్ మారుతుందా ? ఎందుకంటే ఎల్లోమీడియా జనాలవిశ్వనీయత కోల్పోయి చాలాకాలమైందనే ప్రచారముంది. ఈ విషయం 2019 ఎన్నికల్లోను తర్వాత జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల ఫలితాల్లోనే రుజువైంది. కాకపోతే చివరాఖరు అస్త్రంగా ఎల్లోమీడియా జగన్ను వెంటాడుతోందంతే.  

మరింత సమాచారం తెలుసుకోండి: