మహేష్ బాబు కొత్త సినిమా విడుదలవుతోంది అంటే అభిమానుల్లో ఎక్కడలేని ఆసక్తి ఉంటుంది. అంచనాలుంటాయి. ఈసారి అవి తారాస్థాయిలో ఉన్నాయి. మహేష్ బాబు సినిమాలు గతంలో కూడా విడుదలకు సిద్ధమైన సమయంలో హైప్ ఉంటుంది కానీ, సర్కారువారి పాటకు మాత్రం బీభత్సమైన హైప్ ఉంది. ఆ అంచనాలే ఇప్పుడు సూపర్ స్టార్ ని టెన్షన్లో పడేశాయి. కానీ అస్సలు అలాంటి టెన్షన్ ఏదీ లేదన్నట్టుగా కూల్ గా కనిపిస్తున్నాడు మహేష్ బాబు.

కరోనా వల్ల ఈ సినిమాకి బాగా గ్యాప్ వచ్చింది. అందులోనూ పరశురామ్ తో మహేష్ కి ఇది ఫస్ట్ మూవీ. గీత గోవిందం వంటి సూపర్ హిట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని పరశురామ్సినిమా తెరకెక్కించారు. ఇప్పటికే పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. డైలాగ్స్ అదరగొడుతున్నాయి, ట్రైలర్ యూట్యూబ్ లో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఒకరకంగా సినిమాపై ఇవన్నీ అంచనాలు పెంచాయి. ఆ అంచనాలను అందుకోవడం ఏమాత్రం తేడాకొట్టినా పరిస్థితి దారుణంగా ఉంటుంది.

మే 12న మీకు నచ్చే సినిమా సర్కారువారి పాట రాబోతోంది అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తనలోని కాన్ఫిడెన్స్ అంతా బయటపెట్టారు మహేష్ బాబు. మళ్లీ మనందరికీ పండగేనని అన్నారాయన. అభిమానులస ఆశీస్సులు, వారి ఆప్యాయతలు ఎప్పుడూ తన దగ్గర ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు మహేష్ బాబు. సర్కారువారి పాటలో తన పాత్ర కొత్తగా ఉంటుందని అన్నారు. పోకిరి రోజులు గుర్తొచ్చాయని చెప్పారు.

హైప్ మాత్రం అటు అభిమానుల్ని కూడా టెన్షన్ పెడుతోంది. ఈమద్య కాలంలో ఈ స్థాయిలో భారీ హైప్ ఏ సినిమాకు రాలేదు. ఆర్ఆర్ఆర్ పై మొదటినుంచీ అంచనాలున్నాయి. కేజీఎఫ్ పార్ట్ 1 హిట్ కాబట్టి, పార్ట్ 2 పై హోప్స్ ఉన్నాయి. ఆచార్య.. సినిమా చిరు, రామ్ చరణ్ కలయిక కాబట్టి అందరూ అంచనాలు పెంచారు. కానీ ఇప్పుడు పాటలు, ట్రైలర్, డైలాగ్స్ తో ఎక్కడా లేని హైప్ కొట్టేసింది సర్కారువారి పాట. అదే స్థాయిలో సినిమా కూడా వసూళ్ల మోత మోగిస్తుందేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: