ఏపీ రాజకీయాల్లో ఒక విషయం స్పష్టంగా బయటపడింది. అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ అత్యంత బలమైనపార్టీఅని. ఒంటరిగా పోటీచేస్తే ఏ పార్టీకి కూడా వైసీపీని ఓడించేంత సీన్ లేదని అందరు అంగీకరించేశారు. గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలైనా, తాజాగా చంద్రబాబునాయుడు పిలుపైనా దీన్నే సూచిస్తోంది.




ఒకపుడు పవన్ మాట్లాడుతు ప్రతిపక్షాల ఓట్లను చీలనిచ్చేదిలేదంటు భీషణ ప్రతిజ్ఞచేసిన విషయం అందరికీ తెలిసిందే. తాజా పర్యటనలో చంద్రబాబు మాట్లాడుతు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించాలంటే అందరు ఏకమవ్వాలని, ఇందుకు అవసరమైతే తాము త్యాగాలకు కూడా సిద్ధమే అని చంద్రబాబు స్పష్టంచేశారు. చివరకు వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా ఇదే చెబుతున్నారు. జగన్ను ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ కలవటంలో తప్పేమీలేదన్నారు. నిజానికి తప్పని ఎవరు అనలేదసలు





పవన్, చంద్రబాబు, రఘురాజు ఇలా ఎవరెప్పుడు చెప్పినా అందరు చెప్పేదేమంటే ఏ పార్టీకి ఆ పార్టీ విడివిడిగా పోటీచేస్తే జగన్ను ఓడించటం సాధ్యంకాదని. దీంతోనే జగన్ కెపాసిటి ఏమిటో చంద్రబాబు, పవన్, రఘురాజుకు బాగా అర్ధమైపోయింది. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జగనే గెలిస్తే పై ముగ్గురి రాజకీయ చరిత్ర దాదాపు ముగిసిపోయిట్లే అనుకోవాలి. చంద్రబాబుకు ఇప్పటికే 73 ఏళ్ళు దాటిపోయింది. కాబట్టి రాజకీయ జీవితం దాదాపు క్లైమ్యాక్స్ కు వచ్చేసినట్లే.





ఇదే సమయంలో 2024 తర్వాత మరో ఐదేళ్ళు వెయిట్ చేసేంత ఓపిక పవన్ కు లేదు. ఇప్పటికే పట్టుమని పదిరోజులు రాజకీయాలకే తన సమయాన్ని కేటాయించేంత తీరిక, ఓపిక లేదు. ఇక రఘురాజు గురించి చెప్పుకునేదేమీ లేదు. ఎందుకంటే ఆయనేమీ పూర్తిస్ధాయి రాజకీయ నేతకాదు. ఏదో పరిస్ధితులు అనుకూలించి వైసీపీ టికెట్ వచ్చిందికాబట్టి గెలిచారంతే. సో జగన్ కెపాసిటి వీళ్ళందరికీ బాగా అర్ధమైపోయింది కాబట్టే అందరం కలవాలని, లేకపోతే జగన్ను ఓడించలేమని పదే పదే మొత్తుకుంటున్నది. మరి వీళ్ళ ఆశలు ఫలిస్తాయో లేదో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: