జనసేన అధినేత పవన్ కల్యాణ్ లో అయోమయం స్పష్టంగా బయటపడింది. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రాకుండా చేయాలి. కానీ అది ఎలా చేయాలో తెలీదు. పార్టీలన్నింటితో పొత్తు పెట్టుకుని ప్రభుత్వ వ్యతిరేకఓట్లు చీలకుండా చేయాలి. అయితే అందుకు అవకాశాలు ఏమున్నాయో మాత్రం తెలీదు. అన్నీ పార్టీలు ఏకం కావాలని పిలుపుమాత్రం ఇస్తారు. అయితే  ఏ ఏ పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలో మాత్రం తెలీదు. అసలు తాను పిలుపిస్తే సానుకూలంగా స్పందించే పార్టీలేవో కూడా పవన్ కు తెలీదు.





ఇది స్ధూలంగా శిరివెళ్ళ రచ్చబండ కార్యక్రమంలో పవన్ మీడియా సమావేశంలో మాట్లాడినపుడు పవన్లో కనబడిన అయోమయం. ఒకవైపేమో అన్నీ పార్టీలు కలిసిరావాలంటారు. ఇదే సమయంలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ళసమయం ఉందికదా ఇపుడే తొందరేమిటి ? అని ఆయనే అడుగుతారు. తెలుగుదేశంపార్టీతో పొత్తుంటుందా ? అని అడిగితే పొత్తులపై టీడీపీ నుండి ఆహ్వానం వస్తే అప్పుడు ఆలోచిస్తామంటారు.





ఇప్పటికే చంద్రబాబునాయుడు నుండి పొత్తుకు ప్రతిపాదన వచ్చిందన్న విషయం గుర్తుచేస్తే మౌనంగా ఉండిపోయారు. ఇదే సమయంలో చంద్రబాబు పొత్తు ప్రతిపాదనను మిత్రపక్షం బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని బీజేపీ చీఫ్ సోమువీర్రాజు వ్యాఖ్యలను ప్రస్తావించినపుడు ‘వీర్రాజు అలా అన్నారా’ తాను చూస్తా అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చేయాలన్న ఆలోచన ఉందని లేకపోతే మళ్ళీ వైసీపీనే అధికారంలోకి రావటం ఖాయమని పవనే చెప్పారు.





హోలు మొత్తంమీద ప్రెస్ మీట్లో అర్ధమైందేమంటే చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాలని పవన్ మనసులో బలంగా ఉంది. అయితే పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీజేపీని ఎలా ఒప్పించాలో అర్ధం కావటంలేదు. ఇదే సమయంలో బీజేపీతో మాత్రమే పొత్తు కంటిన్యు చేసేట్లయితే జగన్ను ఓడించాలన్న లక్ష్యం సాధ్యంకాదనే ఆందోళన కనబడుతోంది. పోనీ పొత్తును వ్యతిరేకిస్తున్న బీజేపీని వదిలేసి టీడీపీతో పొత్తు పెట్టుకునేంత ధైర్యమూ చేయలేకున్నారు. బీజేపీని కాదని వెళ్ళిపోతే భవిష్యత్ పరిణామాలు ఎలాగుంటాయో అనే భయం వెంటాడుతున్నట్లుంది. పవన్లో ఇన్ని భయాలు, ఆలోచనలు, సందేహాలు స్పష్టంగా కనబడ్డాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: