జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఎవరో రాసిచ్చిన స్క్రప్ట్ చదవటం, దాని ఆధారంగా మాట్లాడటం మాత్రమే వచ్చని మరోసారి రుజువైంది. గడచిన ఎనిమిదేళ్ళుగా పార్టీ అధినేతగా ఉన్నప్పటికీ పవన్ మాట్లాడుతున్న మాటల్లో లాజిక్ ఉండటంలేదు. తాజాగా కర్నూలు జిల్లాలోని శిరివెళ్ళ గ్రామం రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన మాటలే ఇందుకు నిదర్శనం. జనసేన ఆవిర్భా సభలోను తాజాగా పవన్ మాట్లాడుతు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వనని చెప్పారు.





ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతే వైసీపీనే అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డే మళ్ళీ సీఎం అవుతారని భయంతో కూడిన  జోస్యం కూడా చెప్పారు. అయితే ఇక్కడే పవన్ లాజిక్క మిస్సయినట్లు అనిపిస్తోంది. పవన్ పదేపదే చెబుతున్నదేమంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదు. చీలితే మళ్ళీ వైసీపీనే అధికారంలోకి వస్తుందని. పవన్ లాజిక్ తప్పినట్లే అనిపిస్తోంది. ఎలాగంటే 2019 ఎన్నికల్లో ప్రభుత్వంలోని  టీడీపీ వ్యతిరేక ఓట్లు చీలిపోయిన విషయం అందరికీ తెలిసిందే.





ఆ ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీచేసింది. వైసీపీ కూడా సింగిల్ గాన ఎన్నికల్లో పోటీచేసింది. బీజేపీ, కాంగ్రెస్ ది కూడా ఒంటరిపోరే. ఇదే సమయంలో పవన్ ఆధ్వర్యంలో వామపక్షాలు, బీఎస్పీ కూటమిగా పోటీచేశాయి. అంటే అధికార టీడీపీకి వ్యతిరేకంగా ఇన్నిపార్టీలు పోటీచేసినపుడు ఓట్లు చీలిపోయి మళ్ళీ టీడీపీనే గెలవాలి కదా ?  మరెందుకు టీడీపీ ఘోరంగా ఓడిపోయింది ? ప్రతిపక్షాల్లో ఒకటైన వైసీపీకి అనుకూలంగా పెద్దఎత్తున జనాలు ఎందుకు ఓట్లేశారో పవన్ చెప్పగలరా ?





పవన్ లెక్కప్రకారం 2024 ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలితే ప్రతిపక్షాలకే లాభంకదా ? 2019లో జరిగింది చూసిన తర్వాత కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని పవన్ చెప్పటంలో ఏమన్నా అర్ధముందా ? ఇక 2019లో ప్రతిపక్షాలు అన్నీ కలవకపోయినా టీడీపీ ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షమైన వైసీపీకి అఖండ మెజారిటి ఎలా వచ్చింది ? ఇన్ని ఉదాహరణలు కళ్ళముందే కనబడుతుంటే వైసీపీని ఓడించాలంటే ప్రతిపక్షాలన్నీ కలవాలని ఎందుకు చెబుతున్నట్లు ?





ఇదంతా కాదుకానీ ఒకపార్టీ గెలవాలన్నా, అధికారపార్టీ ఓడిపోవాలన్నా రెండు కారణాలుండాలి. మొదటిదేమో పార్టీతో పాటు అధినేతలో దమ్ముండాలి. రెండో కారణం అధికారపార్టీ పరిపాలన పరమచెత్తగా ఉండాలని జనాలు హోలుమొత్తంగా నిర్ణయానికి రావాలి. 2019లో జరిగిందిదే. మరి 2024లో ఏమి జరుగుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: