దావూద్‌ గ్యాంగ్.. ఇప్పటికీ ఈ గ్యాంగ్ ముంబయిలో సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. గ్యాంగ్ లీడర్ దావూద్ ముంబయిలో లేకపోయినా.. ఆయన టీమ్ ఇంకా సజీవంగానే ఉంది. గుట్టుచప్పుడు కాకుండా హవాలా వ్యవహారాలు సాగిస్తోంది. ఈ దావూద్ గ్యాంగ్‌ పై కన్నేసిన జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ.. ఇటీవల ఈ దావూద్ గ్యాంగ్ పై దృష్టి సారించింది. దావూద్ ఇబ్రహీం, అతడి హవాలా ముఠా వ్యవహారాలపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ విచారణ ముమ్మరం చేసింది.


ముంబయిలోని దావూద్ అనుచరుల ఇళ్లపై దాడులు చేపట్టింది. దావూద్ కోసం ముంబయి కేంద్రంగా హవాలా వ్యాపారులు ఇంకా పనిచేస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ  గుర్తించింది. అందుకే జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ  ఇటీవల ముంబయిలోని దాదాపు 20 ప్రాంతాల్లో హవాలా ఆపరేటర్లు, డ్రగ్ స్మగ్లర్లు, రియల్ ఎస్టేట్ మేనేజర్ల ఇళ్లు, కార్యాలయాల్లో విస్తృతంగా ఏక కాలంలో తనిఖీలు చేపట్టింది.


ఈ దావూద్ గ్యాంగ్.. ఉగ్రకార్యకలాపాల ద్వారా దేశంలో విధ్వంసానికి కుట్రపన్నుతున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. దావూద్ కు చెందిన డీ-కంపెనీ హవాలా ఆపరేటర్లు, కీలక వ్యక్తులపై ఈ విషయంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ  కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే ఇప్పుడు దావూద్ అనుచరుల ఇళ్లల్లో సోదాలు జరిపినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.


అంతే కాదు.. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ కు డీ-కంపెనీతో ఉన్న సంబంధాలు ఉన్నాయన్నఆరోపణలు ఉన్నాయి. దావూద్ కుటుంబసభ్యులతో మాలిక్ కు పరిచయాలుు ఉన్నాయని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ  గుర్తించింది. ఈ అంశంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ  సీరియస్‌గా విచారణ జరుపుతోంది. దేశం విడిచి ఇన్నాళ్లయినా ఇంకా దావూద్ ఇబ్రహం ఎక్కడో ఉండి.. ఇంకా ఇక్కడ హవాలా తోపాటు అనేక నేరాలు చేస్తూ ఉండటం ఎన్‌ ఐ ఏకు సవాలుగా మారింది. అందుకే మూలాల నుంచి దావూద్ గ్యాంగ్‌ను టార్గెట్ చేస్తూ వస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: