ఏపీలో ఇక పశువుల కోసం కూడా అంబులెన్సులు రాబోతున్నాయి. రెండు దశల్లో వైయస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవ అంబులెన్స్‌లు ప్రారంభించేందుకు ఏపీ సిద్ధం అవుతోంది. తొలిదశ కింద 175 అంబులెన్స్‌లు సిద్ధంగా ఉన్నాయి. రెండో దశలో మరో 165 అంబులెన్స్‌లు సిద్ధం చేయనున్నారు. అలాగే ఏపీలో జగనన్న పాలవెల్లువ ప్రాజెక్టు ప్రారంభించబోతున్నారు. త్వరలో అనకాపల్లి జిల్లాలో అమూల్‌ జగనన్న పాలవెల్లువ ప్రాజెక్టు ప్రారంభిస్తారు.  


అనకాపల్లి జిల్లాలో 191 గ్రామాల్లో  పాలసేకరణ ప్రారంభిస్తారు. మరో రెండు నెలల్లో ఇప్పటికే జగనన్న పాలవెల్లువ అమలవుతున్న జిల్లాలతో పాటు మొత్తం 1,282 గ్రామాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ప్రాధాన్యతా క్రమంలో బీఎంసీ యూనిట్ల నిర్మాణం చేపడతారు. 1184 బీఎంసీలు, 2388 ఏంఎసీల నిర్మించనున్నారు.  ప్రైవేటు డైరీలలో రైతులు మోసానికి గురికాకుండా ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు.


ఆక్వా ఫీడ్‌ రేట్లపై నిరంతర పర్యవేక్షణ చేయనున్న అధికారులు.. రైతులకు అందుబాటులోఉండేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఆర్బీకేల్లో ఆక్వా అసిస్టెంట్లు ఉన్నారు కాబట్టి వారి నుంచి క్షేత్రస్థాయిలో సమస్యలను నివేదికలు రూపంలో తీసుకుని వాటిపై తగిన చర్యలు తీసుకుంటారు. ఆక్వా రైతు ఇబ్బంది పడితే.. అల్టిమేట్‌గా ఆక్వా ఉత్పత్తులపై ప్రభావం పడుతుంది. అందుకే  దీనిపై తగిన చర్యలు తీసుకునేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు. వీలైనంతత్వరగా ఫిషింగ్ హార్బర్ల  నిర్మాణం పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.


రైతుల కోసం  అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4,200 ప్రాంతాల్లో గోదాములు, కోల్డ్‌ రూములు, డ్రైయింగ్‌ ఫ్లాట్‌ఫాంలు నిర్మిస్తోంది. ఇప్పటికే 1165 గోదాములు, డ్రైయింగ్‌ ప్లాట్‌ఫాంల నిర్మాణానికి సంబంధించి స్ధలాలను ఎంపిక చేశారు. 510 చోట్ల నిర్మాణాలు మొదలయ్యాయి. ఏడాదిలోగా వీటిని పూర్తి చేస్తారు. అలాగే ప్రతి గ్రామంలోనూ ఆర్బీకే స్ధాయిలో ప్రైమరీ ప్రాససింగ్, డ్రైయింగ్‌ ప్రాట్‌ఫాంలు, గోదాములు, కోల్డ్‌రూంలు నిర్మించనున్నారు. ఇకపై ప్రతి ఆర్బీకేలోనూ యంత్రసేవా పథకం కూడా అమలు చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: