అదేంటి సమ్మర్ సీజన్ చివరికి వచ్చేశాం కదా, ఇప్పుడెందుకు రేట్లు భారీగా పెరుగుతాయి అనుకుంటున్నారా.. అదంతే. ప్రతి ఏడాది వేసవి ప్రారంభం అయ్యే సమయంలో ఏసీలు, ఫ్రిజ్ ల రేట్లు భారీగా పెరుగుతాయి. కానీ ఈసారి వేసవి మధ్యలో కూడా వాటి రేట్లలో విపరీతమైన పెరుగుదల కనపడే అవకాశముంది. మే చివరి వారంలో లేదా, జూన్ మొదటి వారం నుంచి పెంచిన రేట్లు అమలులోకి వస్తాయి. దాదాపుగా అన్ని కంపెనీలు 3 నుంచి 5 శాతం వరకు రేట్లు పెంచేందుకు ఆలోచిస్తున్నాయి.

కారణం ఏంటంటం..?
ఎలక్ట్రానికి వస్తువులను తయారు చేసే ముడి పదార్థాల రేట్లు భారీగా పెరిగాయి. ఓవైపు డాలర్ విలువ పెరిగిపోతుండే సరికి దిగుమతులపై భారె పడుతోంది. విడి భాగాలకు ఎక్కడలేని డిమాండ్ పెరుగుతోంది. దీంతో విడిభాగాల రేట్ల ప్రకారం అసలు వస్తువుల రేట్లను కూడా ఆయా కంపెనీలు పెంచేందుకు రెడీ అయ్యాయి. ఈనెలాఖరునుంచి రేట్లు పెరుగుతాయని అంటున్నారు.

ఈమధ్య జనవరిలో ఎలక్ట్రానిక్స్ వస్తువుల రేట్లు భారీగా పెరిగాయి. ఇప్పుడు తక్కువ గ్యాప్ లోనే రెండోసారి రేట్లు పెంచేందుకు నిర్ణయం తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇది మధ్యతరగతి వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే ఎండలు మండిపోతుండే సరికి ప్రతి ఇంట్లో ఒకటి మించి ఏసీలు కొంటున్నారు. వాటి కరెంటు బిల్లులు ప్రతి నెలా అదనంగా చెల్లించాల్సిందే. అందులోనూ ఏసీ రేట్లు భారీగా పెరగడంతో ఈఎంఐలు కూడా ఎక్కువ చెల్లించాల్సిన పరిస్థితి. ఇప్పుడు మరోసారి రేట్లు పెరిగితే మధ్యతరగతి ప్రజలు వాటివైపు చూడాలంటేనే భయమేసే పరిస్థితి.

టీవీ, ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్.. ఇవన్నీ ఇప్పుడు నిత్యావసరాలు అయిపోయాయి. మధ్యతరగతి ప్రతి ఇంటిలోనూ ఇవి కామన్ గా కనిపించాల్సిందే. దీంతో రేటు ఎంతున్నా వాటిని కొనేందుకే ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే అదనుగా కంపెనీలు రేట్లు పెంచేస్తున్నాయి. అయితే ఈసారి మాత్రం ఆయా కంపెనీలకు రీజన్ బాగా దొరికింది. దిగుమతి చేసుకునే వస్తువుల రేట్లు పెరగడం, డాలర్ విలువ పెరగడంతో రేట్లు పెంచడం తప్పనిసరి అంటున్నారు. ఈ నెలాఖరులో లేదా, జూన్ మొదటి వారంలో పెంచిన రేట్లు అమలులోకి వస్తాయని చెబుతున్నారు ఎలక్ట్రానికి కంపెనీల అధినేతలు. ఆమేరకు ఫ్రాంచైజీలన్నీ ముందుగానే వాటిని కొని నిల్వ చేసుకుంటున్నాయి. ఆ తర్వాత వాటిని పెరిగిన రేట్ల ప్రకారం అమ్ముకునే వీలు కూడా వాటికి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: