క్షేత్రస్ధాయిలో జరుగుతన్నది చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. జూన్ 5వ తేదీన కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలోని శివపురం గ్రామంలో చంద్రబాబునాయుడు ఇల్లు కట్టుకోబోతున్నారు. సువిశాల భవంతి నిర్మాణానికి వీలుగా పై గ్రామంలో 2 ఎకరాలను కొన్నారు. దీని రాతకోతలు, రిజస్ట్రేషన్ వ్యవహారాలు కూడా పూర్తయ్యాయి. నిర్మించబోయే భవంతిలో రెసిడెన్స్+పార్టీ ఆఫీసు+సమావేశపు హాలు తదితరాలన్నీ ఉంటాయట.





అంతాబాగానే ఉందికానీ రాజకీయ జీవితం చరమాంకానికి చేరుకుంటున్న సమయంలో ఇపుడు చంద్రబాబు కుప్పంలో ఇల్లు కటుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. 2024 ఎన్నికలే చంద్రబాబు రాజకీయజీవితానికి దాదాపు క్లైమ్యాక్స్ అనే అనుకోవాలి. వచ్చే ఎన్నికల్లో గెలిచినా, ఓడినా చంద్రబాబుకు అదే చివరి ఎన్నికలు అనుకోవాలి. ఇప్పటికే 73 ఏళ్ళల్లో ఉన్న చంద్రబాబు వచ్చే ఎన్నికల నాటికి 75 దాటిపోతారు. ఇక మళ్ళీ ఎన్నికలంటే చంద్రబాబు వయసు అప్పటికి 80 ఏళ్ళు  అయిపోతుంది. కాబట్టి 2024 ఎన్నికలే చివరి ఎన్నికలని అనుకుంటున్నారు.





అలాంటపుడు కేవలం ఒకఎన్నిక కోసం కుప్పంలో ఇల్లు కడుతున్నారంటే చాలామంది నమ్మటంలేదు. 1989 నుండి ఇక్కడే ఉంటున్న చంద్రబాబుకు ఒక ఇల్లు కట్టుకోవాలని అనిపించలేదు. అలాంటిది రాజకీయజీవితం ముగిసే దశలో సొంతిల్లంటే విచిత్రంగా ఉంది. ఈ నేపధ్యంలోనే పార్టీలో జరుగుతున్న చర్చేమిటంటే కుప్పం నుండి లోకేష్ పోటీ చేసే అవకాశాలున్నాయట. ఎందుకంటే లోకేష్ కు ఇపుడు పోటీచేసేందుకు సరైన  నియోజకవర్గంలేదు.





మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన మంగళగిరిలోనే మళ్ళీ పోటీచేస్తున్నట్లు ప్రకటించారు కానీ చివరి నిముషంవరకు నమ్మకంలేదు. ఇందుకనే తనను దశాబ్దాలపాటు ఆదరించిన కుప్పంనే కొడుకు వారసత్వంగా ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారంలో ఉంది. ఒక్క ఎన్నిక కోసం సొంతింటిని నిర్మించుకునే వ్యక్తికాదు చంద్రబాబు. అసలు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పోటీచేసేది కూడా డౌటనే అంటున్నారు. కుప్పంలో లోకేష్ ను పోటీచేయించి చంద్రబాబు  రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేసే ఆలోచనలో ఉన్నారని పార్టీలోనే చెప్పుకుంటున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: