జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాగా సఫొకేషన్ ఫీలవుతున్నట్లే ఉంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు విషయంలో పవన్ ఆలోచనలకు, మిత్రపక్షమైన బీజేపీ నేతల ఆలోచనలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. దాంతో ఏమిచేయాలో అర్ధంకాక పవన్ బాగా ఇబ్బందిపడుతున్నట్లుంది. ఎందుకంటే ఉన్నపళంగా మిత్రపక్షాన్ని కాదని తనిష్టమొచ్చిన నిర్ణయం తాను తీసుకునే స్ధితిలో పవన్ లేరు. అలాగని బీజేపీని ఒప్పించేంత సీన్ కూడా తనకు లేదు. అందుకనే బాగా సఫొకేష్ ఫీలవుతున్నట్లు సమాచారం.





ఇంతకీ విషయం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలనే కసి పవన్లో రోజురోజుకు పెరిగిపోతోంది. అయితే తన కసితీరే మార్గం మాత్రం కనబడటంలేదు. కేవలం బీజేపీతో మాత్రమే పోటీచేయటం వల్ల జన్మలో ముఖ్యమంత్రి కాదుకదా కనీసం పాతికసీట్లు కూడా గెలిచేది లేదని పవన్ కు  బాగా తెలుసు. అందుకనే చంద్రబాబునాయుడును కూడా కలుపుకుని వెళ్ళాలని పవన్ బలంగా కోరుకుంటున్నారు. అయితే అందుకు బీజేపీ నేతలు అంగీకరించటంలేదు.





తాజాగా సునీల్ ధియోధర్ మాట్లాడుతు కుటుంబ, అవినీతి పార్టీ అయిన తెలుగుదేశంపార్టీతో పొత్తు పెట్టుకునేది లేదని చెప్పారు. ఇదే విషయాన్ని బీజేపీ చీఫ్ సోమువీర్రాజు కూడా పదే పదే గట్టిగానే చెబుతున్నారు. చంద్రబాబును బీజేపీ నేతలు అవినీతిపార్టీ అని చెప్పి దూరంపెట్టేకొద్దీ పవన్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. పొత్తులు డిసైడ్ చేసేది నరేంద్రమోడి, అమిత్ షా మాత్రమే అని అందరికీ తెలిసిందే. వీళ్ళద్దరిని తనకు అనుకూలంగా మార్చుకునేంత సీన్ పవన్ కు లేదు. ఎందుకంటే అమిత్ షా అపాయిట్మెంట్ సంపాదించటమే పవన్ వల్ల కావటంలేదు.





అమిత్ షా అపాయిట్మెంటే సంపాదించలేని పవన్ ఇక పొత్తుల విషయం ఏమి మాట్లాడగలరు ? పైగా ప్రాంతీయపార్టీలతో పొత్తంటేనే నరేంద్రమోడి మండిపోతున్నారు. మోడి లైన్ ప్రకారమే మిగిలిన నేతలు నడుచుకోవాలి కాబట్టే బీజేపీకి చంద్రబాబు దగ్గరకాలేకపోతున్నారు. చంద్రబాబుకి కమలనాదులతో దూరం పెరిగేకొద్దీ జనసేనకు నష్టం పెరిగిపోతోంది. మరి చివరకు ఏమి జరుగుతుందో తెలీక పవన్లో గందరగోళం పెరిగిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: