వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజా కామెంట్లు చూసిన తర్వాత అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఏకమవుతాయన్నారు. ప్రతిపక్షాల కూటమిలో గరిష్టంగా మూడు కానీ కనిష్టంగా రెండుపార్టీలు కానీ ఉంటాయని జోస్యం కూడా చెప్పారు. నిజానికి ఈ విషయాన్ని ఎంపీ చెప్పాల్సిన పలేలేదు ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నదే. మిత్రపక్షాలైన బీజేపీ-జనసేనలతో చంద్రబాబునాయుడు కలిస్తే మూడు పార్టీల కూటమి అవుతుంది.





ఇదే సమయంలో చంద్రబాబును కలుపుకోవటానికి బీజేపీ ఇష్టపడకపోతే జనసేన+టీడీపీ పొత్తులో వెళతాయని ప్రచారంలో ఉన్నదాన్నే ఎంపీ చెప్పారు. ఇక్కడే మరో విషయాన్ని కూడా ఎంపీ చెప్పారు. అదేమిటంటే తాను కూటమిలో చేరుతానని, ప్రతిపక్షాల కూటమిగా ఏర్పాటులో కీలకంగా ఉంటానన్నారు. నిజానికి ఇదే ఎంపీ విషయంలో చాలా కీలకమైన పాయింట్. ఎందుకంటే బీజేపీకి చంద్రబాబుకు పొత్తుకుదిర్చేంత సీన్ ఎంపీకిలేదు. బీజేపీలో రాజు మాట వినే వాళ్ళే ఎవరు లేరసలు. 





బీజేపీతో చంద్రబాబు కలవటమనే నిర్ణయం తీసుకోవాల్సింది నరేంద్రమోడి మాత్రమే. కాబట్టి పొత్తులు, కూటమి విషయంలో ఎంపీ చేయగలిగేదేమీలేదు. ఇదే సమయంలో బీజేపీని వదిలేసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. నిజానికి ఈ పొత్తుల కోసమే ఎంపీ ప్రయత్నిస్తున్నట్లున్నారు. బీజేపీతో ఉంటే రాలేది బూడిదే అని ఎంపీకి బాగా తెలుసు. అదే టీడీపీ-జనసేనను కలిపి, తాను జనసేన తరపున పోటీచేస్తే గెలిచిపోవచ్చనే ప్లానులో ఎంపీ ఉన్నారు.





అందుకనే లోలోపల టీడీపీ+జనసేన పొత్తుల కోసమే తిరుగుబాటు ఎంపీ కూడా ప్రయత్నిస్తున్నట్లున్నారు. ఆ విషయం బయటపడితే బీజేపీతో గొడవలైతే అసలుకే మోసం వస్తుందని ఎంపీకి బాగా తెలుసు. అసలే బ్యాంకుల నుండి సుమారు రు. వెయ్యికోట్లు ఎగ్గొట్టిన కేసు సీబీఐ చేతిలో ఉంది.  మోడి, అమిత్ షా ఆగ్రహిస్తే తన బతుకేమవుతుందో ఎంపీ కి బాగా తెలుసు. అందుకనే ఇపుడు లో ప్రొఫైల్ మైన్ టెన్ చేసి చివరలో జనసేనలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.




మరింత సమాచారం తెలుసుకోండి: