వచ్చే ఎన్నికలకు సంబంధించి చంద్రబాబునాయుడు విషయంలో మూడు ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ మూడు విషయాలు పార్టీనేతల మధ్య కూడా చర్చల్లో ఉంది. ఇంతకీ ఆ మూడు విషయాలు ఏమిటంటే మొదటిది కుప్పంలో చంద్రబాబు పోటీచేయటం. రెండో ప్రచారం ఏమిటంటే చంద్రబాబు రెండు నియోజకవర్గాల్లో పోటీచేయబోతున్నారని. ఇక మూడో ప్రచారం ఏమిటంటే చంద్రబాబు అసలు పోటీకే దూరంగా ఉంటారని.





గడచిన ఏడు ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో వరసగా గెలుస్తునే ఉన్నారు. అలాంటిది వచ్చే ఎన్నికల్లో గెలుపు అంత ఈజీకాదని అర్ధమైపోతోంది. చంద్రబాబును ఎలాగైనీ ఓడించి తీరాలని జగన్మోహన్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకు తగ్గట్లే కుప్పంలో పావులు కూడా కదుపుతున్నారు. దాంతో చంద్రబాబు గెలుపుపై అనుమానాలు పెరిగిపోతున్నాయి.  ఈ నేపధ్యంలోనే కుప్పంలో చంద్రబాబు పోటీచేస్తే ఒకసమస్య, పోటీ చేయకపోతే మరోసమస్య.





పోటీచేస్తే సమస్యేమిటంటే ఎక్కువ దృష్టి నియోజకవర్గంలోనే పెట్టాల్సుంటుంది. అప్పుడు నారా లోకేష్ పోటీచేసే నియోజకవర్గంతో పాటు మిగిలిన నియోజకవర్గాల మీద దృష్టి తగ్గిపోతుంది. కుప్పంలో ఎలాగూ గెలుస్తామన్న ధైర్యంతో మిగిలిన నియోజకవర్గాలపై దృష్టిపెడితే కుప్పంలో అసలుకే మోసం వచ్చే అవకాశముంది. ఇక రెండో ప్రచారం ప్రకారం కుప్పంతో పాటు మరో నియోజకవర్గంలో పోటీచేసినా సమస్యే. కుప్పంలో గెలుపునమ్మకం లేకే రెండో నియోజకవర్గంలో కూడా పోటీచేస్తున్నారని వైసీపీ మొదలుపెడుతుంది.





అప్పుడు కుప్పంతో పాటు రెండో నియోజకవర్గంలో గెలవటం కూడా చంద్రబాబుకు ప్రతిష్టాత్మకమవుతుంది. రెండింటిలో ఎక్కడే తేడా వచ్చినా ఇబ్బందే. ఇక మూడో ప్రచారం అసలు పోటీకే దూరంగా ఉండటం.  పార్టీని గెలిపించటం అవసరం కాబట్టి తాను కుప్పానికి పరిమితం కాకుండా అన్నీ నియోజకవర్గాల్లో తిరగాల్సుంటుంది కాబట్టే పోటీకి దూరంగా ఉంటున్నట్లు చెప్పుకోవచ్చు. ఇది కూడా చంద్రబాబు ఇమేజీకి దెబ్బే. ఎలాగంటే కుప్పంలో ఓటమి భయంతోనే చంద్రబాబు అసలు పోటీనే చేయటంలేదని వైసీపీ నేతలంటారు. స్ధూలంగా చూస్తే మూడు ప్రచారాలు కూడా చంద్రబాబును ఇబ్బందిపెట్టేవే. మరీ ప్రచారాన్ని చంద్రబాబు ఎలా తిప్పికొడతారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: