వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీచేయబోయే నియోజకవర్గం డిసైడ్ అయ్యిందా ? అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం తిరుపతిలో  పవన్ పోటీచేయడానికి దాదాపు డిసైడ్ అయినట్లు సమాచారం. నిజానికి పోయిన ఎన్నికల్లోనే పవన్ ఇక్కడినుండి పోటీచేయాల్సింది. అయితే అప్పుడు చేసిన తప్పువల్లే పోటీచేసిన భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో ఓడిపోయారు. 





పవన్ పోటీచేయబోయే నియోజకవర్గాలను ఎంపిక చేయటానికి కమిటి పెద్దఎత్తున కసరత్తుచేసి చివరకు ఓడిపోయే రెండు నియోజకవర్గాలను ఎంపికచేసింది. రెండు నియోజకవర్గాల్లో కచ్చితంగా ఒకదానిలో పవన్ ఓడిపోతారని మొదటినుండి అందరు అనుకుంటున్నదే. అంటే చాలామందికి ఉన్న కనీస జ్ఞానం కూడా పవన్ కు లేకపోవటమే విచిత్రం. సరే అప్పటిసంగతిని పక్కన పెట్టేస్తే వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలని పవన్ గట్టి పట్టుదలతో ఉన్నారట. అందుకనే తిరుపతిని ఎంపిక చేసుకున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి.





తిరుపతిలో బలిజ(కాపు)ఓట్లు ఎక్కువున్నాయి. తర్వాత బ్రాహ్మణ, బీసీ, ముస్లిం, ఎస్సీ, రెడ్ల ఓట్లున్నాయి. ఇక్కడ టీడీపీకి కూడా గట్టి ఓటుబ్యాంకుంది. ఏ రకంగా చూసుకున్నా పవన్ కు ఇది సేఫ్ సీటే. ఈ లెక్కలన్నీ వేసుకునే మెగాస్టార్ చిరంజీవి కూడా ఇక్కడ పోటీచేసి గెలిచింది. ఇంతమాత్రం తెలివి కూడా పవన్ కు లేకపోయింది. మొన్నటి ఎన్నికల్లోనే ఇక్కడనుండి పోటీచేసుంటే పై వర్గాల్లో మెజారిటి ఓట్లు పవన్ కు పడేవనటంలో సందేహంలేదు.





ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే  అప్పట్లో కరుణాకర్ రెడ్డంటే పడని వాళ్ళు కూడా పవన్ కు వేసుండేవారు.  అయితే వచ్చే ఎన్నికల్లో పవన్ కు గెలుపు అవకాశం ఎంతుందనేది ఇపుడే చెప్పలేం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి సంక్షేమపథకాలు అమలుచేస్తున్నారు. పథకాలు అందుతున్న వాళ్ళలో మెజారిటి మళ్ళీ వైసీపీకే ఓట్లేయాలని అనుకుంటే తిరుపతిలో ప్రతిపక్షాల తరపున ఎవరు పోటీచేసినా గెలిచేది అనుమానమే. మరి పవన్ తిరుపతిలో మాత్రమే పోటీచేస్తారా ? లేకపోతే ఇంకో నియోజకవర్గం కూడా వెతుక్కుంటున్నారా అన్నది మాత్రం తేలలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: