నారాయణ విద్యాసంస్ధల ఛైర్మన్ కుటుంబం యావత్తు వణికిపోతోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. మొదటేమో నారాయణ బెయిల్ తెచ్చుకున్నారు. ఇపుడు ఇద్దరు కూతుళ్ళు, అల్లుడితో పాటు సంస్ధలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న పదిమంది ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే 10వ తేదీ పరీక్షల ప్రశ్నపత్రాల్లో లీకేజీ వ్యవహారంలో పోలీసులు కేసు నమోదుచేసింది కేవలం నారాయణ మీద మాత్రమే.





క్వశ్చన్ పేపర్ల లీకేజీకి సూత్రదారని నారాయణను పోలీసులు అరెస్టు చేయటం వరకు బాగానే ఉంది. అయితే పోలీసులు నారాయణ కుటుంబంజోలికి అసలు వెళ్ళనేలేదు. అయినా సరే కూతుళ్ళు, అల్లుడితో పాటు మరో పదిమంది ముందస్తు బెయిల్ ఎందుకు తెచ్చుకున్నట్లు ? అంటే తమను కూడా పోలీసులు అరెస్టులు చేస్తారని భయపడుతున్నారు. తనను అరెస్టుచేసినపుడు నారాయణ వాదన ఏమిటంటే విద్యాసంస్ధలతో తనకు ఎలాంటి సంబంధంలేదని.





విద్యాసంస్ధల ఛైర్మన్ గా తాను ఎప్పుడో రాజీనామా చేశాను కాబట్టి లీకేజీలో తన పాత్ర లేదని నారాయణ వాదించారు. ఇంతవరకు బాగానే ఉందికానీ మరి నారాయణ విద్యాసంస్ధల బాధ్యతలు ఎవరు చూస్తున్నారు ? ఇద్దరు కూతుళ్ళు, అల్లుడిలోనే బాధ్యతలు చూస్తున్నవాళ్ళు ఉండుంటారుకదా. మరి వాళ్ళల్లో ఎవరి బాధ్యత ఎంతనేది పోలీసుల విచారణలోనే తేలుతుంది. సో తమను కూడా పోలీసులు అరెస్టు చేస్తారన్న భయంతోనే ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అంటే ఈ ముగ్గురిలోనే లీకేజీల సూత్రదారులున్నారని  అర్ధమైపోతోంది.






లేకపోతే అనుమానితులు కాదు, బాధ్యులుగా పోలీసులూ చెప్పలేదు, కనీసం విచారణకు కూడా పిలిపించలేదు. అయినా పదమూడుమందీ ముందస్తు బెయిల్ తెచ్చేసుకున్నారంటేనే వీళ్ళు ఎంతగా వణికిపోతున్నారో తెలుస్తోంది. రాజీనామా చేశాను కాబట్టి విద్యాసంస్ధలతో తనకు సంబంధంలేదని నారాయణ చెప్పుకున్నారు. మరి కూతుళ్ళు, అల్లుడు+పదిమంది ఏమని చెబుతారు ? వీళ్ళల్లో కూడా ఎవరికీ నారాయణ విద్యాసంస్ధలతో ఎలాంటి సంబంధాలు లేవా ? మొత్తానికి గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లయ్యింది. చివరకు విచారణలో ఏమి తేలుతుందో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: