ఇటీవల శ్రీలంక ఆర్థిక కష్టాలు చూశాం, చూస్తున్నాం. ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏర్పడిన ఆ దేశంలో ప్రభుత్వం కూడా కుప్పకూలింది. ప్రధాని మారారు. అన్నిటికంటే మించి ప్రజల జీవనం ఒక్కసారిగా స్తంభించిపోయింది. అన్నిటికీ రేట్లు పెరిగాయి, ఏ పొరుగు దేశం కూడా ఆదుకునే స్థితిలో లేదు. పర్యాటక రంగంపై ఆధారపడే శ్రీలంకకు ఇప్పుడు టూరిస్ట్ లు కూడా పూర్తిగా తగ్గిపోయారు. దీంతో శ్రీలంక తీవ్ర దుర్భిక్షంలో మునిగిపోయింది. అలాంటి పరిస్థితి ఏపీకి కూడా వస్తుందా..? పవన్ కల్యాణ్ ట్వీట్ ఏం చెబుతోంది.
 

పవన్ కల్యాణ్ తాజాగా ఓ ట్వీట్ వేశారు. భారత్ లోని కొన్ని రాష్ట్రాల డెబ్ట్ జీడీపీ శాతాన్ని శ్రీలంకతో పోలుస్తూ ఓ వార్తా కథనం వెలువడింది. దాన్ని ట్వీట్ చేస్తూ పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏపీలో కూడా త్వరలో ఇలాంటి పరిస్థితి ఎదురవబోతోందని చెప్పారు. ముందు ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలని, అప్పులను తగ్గించుకోవాలని సూచించారు పవన్.

ఎందుకీ గొడవంతా..?
ఇటీవల పవన్ కల్యాణ్ ని నేరుగా టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నేతలు. సీఎం జగన్ కూడా పవన్ ని చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ దశలో జనసేన కూడా పూర్తిగా రివర్స్ అవుతోంది. పవన్ కల్యాణ్ కూడా యాక్టివ్ అవుతున్నారు. తనను దత్త పుత్రుడు అంటే.. జగన్ ని సీబీఐ దత్త పుత్రుడు అంటానని చెబుతున్నారు. ఆ దిశగా పార్టీ శ్రేణులు కూడా కామెంట్లు పెడుతున్నాయి. తాజాగా ఇప్పుడు ఏపీ ఆర్థిక పరిస్థితిపై పవన్ ధ్వజమెత్తారు. గడప గడపకు ఎమ్మెల్యేలు అనే కార్యక్రమాలతో ప్రజల్ని మభ్యపెట్టడం కాకుండా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కబడే పనులు చేయాలని హితవు పలుకుతున్నారు పవన్ కల్యాణ్.

అటు చంద్రబాబు కూడా ఏపీ పరిస్థితి శ్రీలంకలా మారే ప్రమాదం ఉందని గతంలో హెచ్చరించారు. ఇప్పుడు పవన్ కూడా అదే  పల్లవి అందుకున్నారు. ఏపీని ప్రమాదంలో నెట్టేస్తున్నారని, శ్రీలంకలా మార్చేస్తున్నారని విమర్శిస్తున్నారు. పవన్ కల్యాణ్ ట్వీట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. నిజంగానే ఏపీ శ్రీలంకలా ప్రమాదంలో పడుతుందో లేదో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: