దేశంలో ద్రవ్యోల్బణం రోజురోజుకి చాలా పెరుగుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రజల జీవనాన్ని బాగా ప్రభావితం చేస్తుంది. ఇక ఆహారం, ఇంధనం ఇంకా అలాగే విద్యుత్  ధరల పెరుగుదల కారణంగా టోకు ద్రవ్యోల్బణం వరుసగా 13వ నెలలో రెండంకెల స్థాయిలోనే కొనసాగుతోంది.ఇక టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం ఏప్రిల్‌ నెలలో 15.08 శాతానికి చేరుకుంది. టోకు ద్రవ్యోల్బణం డిసెంబర్ నెల 1998 తర్వాత మొదటిసారిగా 15% దాటింది. డిసెంబర్ 1998లో ఇది 15.32 శాతం వద్ద ఉంది. మార్చి 2022లో 14.55 శాతం వద్ద ఉండగా, ఫిబ్రవరిలో 13.11 శాతం వద్ద ఉంది. ఏప్రిల్ నెల 2021 నుంచి టోకు ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయిలోనే ఉంది. పెరుగుతున్న ఆహారం ఇంకా ఇంధన ధరల కారణంగా ద్రవ్యోల్బణం పెరుగుతోందని నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఏప్రిల్ నెలలో ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం రేటు మొత్తం 8.35% కాగా మార్చి 8.06 శాతంగా ఉంది. ఏప్రిల్‌లో ముడి పెట్రోలియం ఇంకా అలాగే సహజ వాయువు ద్రవ్యోల్బణం 69.07%గా ఉంది. అదే సమయంలో ఇంధనం ఇంకా శక్తి ద్రవ్యోల్బణం 38.66%కి పెరిగింది. ఇది మార్చి 2022లో 34.52% ఉంది. తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం మార్చి 2022లో 10.7 శాతం నుండి ఏప్రిల్‌లో 10.85 శాతంకి చేరింది.కూరగాయలు, గోధుమలు, పండ్లు ఇంకా అలాగే బంగాళదుంపల ధరలు ఏడాది ప్రాతిపదికన ఏప్రిల్‌ నెలలో బాగా పెరిగాయి.



ఇక ఇవి ఆహార ద్రవ్యోల్బణం పెరిగేందుకు కారణమయ్యాయి. అలాగే చమురు, విద్యుత్ విషయానికొస్తే, ద్రవ్యోల్బణం రేటు 38 శాతం,తయారీ ఉత్పత్తుల టోకు ద్రవ్యోల్బణం రేటు 10.85 శాతం, అలాగే నూనెగింజలు ద్రవ్యోల్బణం 16.10 శాతంగా ఉంది.చమురు ఇంకా ఆహార వస్తువుల ధరల పెరుగుదల కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం అనేది 8 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఇక ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఏప్రిల్‌ నెలలో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 7.79 % కి పెరిగింది. ఇది మే 2014లో ద్రవ్యోల్బణం 8.32 శాతం ఉంది. ఇండియాలో ద్రవ్యోల్బణం రెండు రకాలు. ఒకటి రిటైల్ ద్రవ్యోల్బణం ఇంకా మరొకటి టోకు ద్రవ్యోల్బణం. రిటైల్ ద్రవ్యోల్బణం రేటు సాధారణ కస్టమర్లు అందించే ధరలపైన ఆధారపడి ఉంటుంది. ఇక దీనిని వినియోగదారుల ధర సూచిక (CPI) అని కూడా అంటారు. అయితే, హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (WPI) హోల్‌సేల్ మార్కెట్‌లోని ఒక వ్యాపారి మరొక వ్యాపారికి వసూలు చేసే ధరలను సూచిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: