సాధారణంగా రాజకీయ నాయకులు తమ ప్రాంతాల్లో ప్రజల వద్దకు చేరి  పర్యటించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి పర్యటనల సమయంలో ప్రభుత్వ పథకాలు సరిగా అందుతున్నాయా లేదా అని తెలుసుకుంటూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు ఇలా పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు అటు జనాల నుంచి వింత ప్రశ్నలు ఎదురవుతాయి అన్న విషయం తెలిసిందే. ఇలాంటి ప్రశ్నలు విన్న తర్వాత కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తే మరికొంతమంది నవ్వుకుని అక్కడి నుంచి వెళ్ళి పోతూ ఉంటారు.


 ఇప్పుడు ఏపీలో గడపగడపకు వైసీపీ అనే కార్యక్రమంలో భాగంగా నగరి ఎమ్మెల్యే మంత్రి రోజా సెల్వమణి చిత్తూరు నగరిలో పర్యటిస్తున్నారు అన్న విషయం తెలిసిందే  పర్యటనలో భాగంగా ప్రజలందరినీ కలిసి వారి బాగోగులు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు అందరికీ సమర్థవంతంగా అందుతున్నాయా లేదా అన్న విషయాలను అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఇలా పర్యటనకు వెళ్లిన సమయంలో రాజకీయ నాయకులు ఒక వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పెట్టడం చేస్తూ ఉంటారూ అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఒక వృద్ధుడు రోజని వింత ప్రశ్న అడిగిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



 వీడియో లో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ సక్రమంగా వస్తుందా అంటూ కొంతమందిని అడిగారు మంత్రి రోజా. ఈ క్రమంలోనే ఓ వృద్ధుడి తో మాట్లాడారు. ఏం తాత పింఛన్ వస్తుందా లేదా అంటూ పలకరించారు. తనకు నెలనెలా పింఛను వస్తుంది అంటూ ఆ వృద్ధుడు చెప్పాడు. సరే అంటూ రోజా వెళ్ళిపోతుండగా తాను ఒంటరిగా ఉన్నందుకు తనకు పెళ్లి కావాలని.. పెళ్లి కూతురు ని చూడాలి అంటూ రోజాని కోరాడు. వృద్ధుడి విన్నపం విని ఒక్క సారిగా షాక్ అయి రోజా నవ్వుకుంది. పింఛన్ అయితే ఇవ్వగలను కానీ పెళ్లికూతురును ఎక్కడనుంచి తీసుకురావాలి అంటూ సరదా సంభాషణ చేసింది రోజ..

మరింత సమాచారం తెలుసుకోండి: