రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి వేసే ఎత్తులు, చేసే చిత్తులు, కదుపుతున్న పావులు ప్రత్యర్ధులకు కాదుకదా పక్కనే ఉన్నవారికి కూడా ఓ పట్టాన అర్ధంకావంతే. పదవుల పంపకంలో ఎప్పుడు ఎవరిని సెలక్ట్ చేస్తారో, ఎందుకు సెలక్ట్ చేస్తారో కూడా అర్ధంకాదు. ఇప్పుడిదంతా ఎందుకంటే రాజ్యసభ అభ్యర్ధిగా ఆర్ కృష్ణయ్యను జగన్ ఫైనల్ చేశారు. విజయసాయిరెడ్డికి రెన్యువల్ దక్కగా మరో బీసీ నేత బీద మస్తాన్ రావు, న్యాయవాది నిరంజన్ రెడ్డి ఫైనల్ అయ్యింది.  కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి తెలంగాణా వ్యక్తులు కావటం గమనార్హం.





జాతీయ బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు కృష్ణయ్యది తెలంగాణాలోని వికారాబాద్. 2014లో టీడీపీ తరపున మేడ్చల్ ఎంఎల్ఏగా పోటీచేసి గెలిచారు. తర్వాత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మిర్యాలగూడలో పోటీచేసి ఓడిపోయారు. తర్వాత పార్టీలకు దూరమైపోయి బీసీ సంక్షేమంపైనే  పనిచేస్తున్నారు. అలాంటిది హఠాత్తుగా వైసీపీ రాజ్యసభ అభ్యర్ధిగా ఎలా ఎంపికయ్యారో అర్ధం కావటంలేదు. కృష్ణయ్య పేరు ఫైనల్ కాగానే  బీసీ సంఘాల్లో ఫుల్లు జోష్ మొదలైపోయింది. జగన్ మొదటినుండి బీసీలకు మ్యాగ్జిమమ్ పదవులు ఇస్తున్న విషయం తెలిసిందే.





పార్టీ తరపున కృష్ణయ్యను రాజ్యసభకు జగన్ పంపబోతున్నట్లు పార్టీలోని నేతలకు తెలీదంటే ఆశ్చర్యంగా ఉంది. ఈయనను రాజ్యసభకు పంపటం ద్వారా వైసీపీకి దూరంగా ఉన్న బీసీ వర్గాలు దగ్గరయ్యేందుకు కృష్ణయ్య ఉపయోగపడతారనే అనుకోవాలి. తమకు దూరమైన బీసీలను మళ్ళీ దగ్గరకు తీసుకునేందుకు చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రయత్నాలకు జగన్ షాక్ ఇచ్చినట్లే అనుకోవాలి. కృష్ణయ్యేమీ ఆర్ధికంగా బలమైన వ్యక్తికాదు. రాజకీయంగా పవర్ ఫుల్లు కూడా కాదు. అయినా కృష్ణయ్యను ఎంపిక చేశారంటే జగన్ ప్లాన్ ఏదో ఉందన్నది అర్ధమైపోతోంది.






బీసీల నేతగా కృష్ణయ్యకు మంచిపేరే ఉంది. బీసీల్లో ఈయనకు మంచి ఇమేజే ఉందనటంలో సందేహంలేదు. కాకపోతే బీసీల్లోనే రాష్ట్రంలోనే, పార్టీలోనే చాలామంది నేతలున్నపుడు ఏరికోరి కృష్ణయ్యనే జగన్ ఎందుకు ఎంపిక చేశారన్న ప్రశ్నకు ఎవరిదగ్గరా సమాధానం లేదు. కృష్ణయ్యను ఎంపికచేస్తే ఇటు బీసీలను మరింత దగ్గరకు తీసుకున్నట్లుంటుంది, టీడీపీకి షాకిచ్చినట్లూ ఉంటుంది. ఇందుకనే జగన్ లెక్కలు ఓ పట్టాన ఎవరికీ అర్ధంకావనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: