పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు సమావేశంలో మాట్లాడిన మాటలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మాటలను ఎలా అర్ధంచేసుకోవాలో తెలీక సమావేశంలో పాల్గొన్న తమ్ముళ్ళు బుర్రలు గోక్కునుంటారు. విషయం ఏమిటంటే అధికారపార్టీ గడప గడపకు వైసీపీ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. క్షేత్రస్ధాయిలో జనాల తిరుగుబాటు చూసిన తర్వాత వైసీపీ ఓడిపోతుందని జగన్మోహన్ రెడ్డికి అర్ధమైపోయిందని చంద్రబాబు అన్నారు.





గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో జనాల్లో తమపై వ్యతిరేకత చూపిస్తారని ముందే జగన్ చెప్పిన విషయాన్ని చంద్రబాబు మరచిపోయారు. జనాలు ఆగ్రహం వ్యక్తంచేసినా అందరు కార్యక్రమంలో పాల్గొనాల్సిందే అని జగన్ స్పష్టంగా చెప్పారు. పైగా ఇపుడు గోలచేస్తున్న జనాలంతా టీడీపీ వాళ్ళే అనే ప్రచారం కూడా ఉంది. సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే జనాల్లో వ్యతిరేకత చూసిన తర్వాత జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశముందని చంద్రబాబు చెప్పారు.





జనాల్లో వ్యతిరేకత ఉన్నదే నిజమైతే ముందస్తు ఎన్నికలకు వెళితే జగన్ గెలుస్తారా ? లేకపోతే షెడ్యూల్  చివరివరకు పదవిలోనే ఉండాలని కోరుకుంటారా ? ఇలా ముందస్తుకు వెళ్ళే కదా చంద్రబాబు 2004లో ఓడిపోయింది. జనాల వ్యతిరేకత కారణంగా ప్రభుత్వాన్ని ఎంతోకాలం నడపలేమని జగన్ కు అర్ధమైపోయిందట. మరిదే నిజమైతే ఒంటరిగానే పోటీచేసి జగన్ను ఓడించచ్చుకదా. పొత్తుల కోసం ఎందుకని అంతగా వెంపర్లాడుతున్నారు ?






ఇంత చెప్పిన చంద్రబాబు టీడీపీ బలపడిందని మాత్రం చెప్పలేదు. వైసీపీ మీద జనాలంతా వ్యతిరేకంగా ఉన్నారనేందుకు చంద్రబాబు దగ్గర ఆధారాలేమీలేవు. జగన్ పై వ్యతిరేకతుంది కాబట్టి జనాలంతా టీడీపీకే ఓట్లేసి మళ్ళీ గెలిపిస్తారనే భ్రమలో ఉన్నారు. అంటే జగన్ పై వ్యతిరేకతనే నమ్ముకున్నారు కానీ తన పార్టీని బలోపేతం చేసుకునే విషయాన్ని మాత్రం చూడటంలేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తాము కచ్చితంగా గెలుస్తామని చెప్పే తమ్ముళ్ళు పదిమంది కూడా కనబడటంలేదు. ఈ విషయంలోనే చంద్రబాబు మాటలు తమ్ముళ్ళకు అర్ధంకావటంలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: