సినీ నటుడు అలీకి వైసీపీ తరపున రాజ్యసభ టికెట్ ఇస్తారనే ప్రచారం జోరుగా నడిచింది. అయితే అది సాధ్యం కాలేదు. ఈసారి నాలుగు సీట్లు ఖాళీ అవగా.. అందులో ఓ సీటుని తిరిగి విజయసాయిరెడ్డికే ఇచ్చారు. మిగతా మూడు స్థానాల్లో కొత్తవారిని నిలబెట్టారు. నిరంజన్ రెడ్డి, బీదా మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్యలకు వైసీపీ తరపున ఛాన్స్ ఇచ్చారు. అయితే చాలా కాలంగా వినిపిస్తున్న అలీ పేరు మాత్రం లిస్ట్ లో లేకపోవడంతో ఆయన ఫీలయ్యారని తెలుస్తోంది.

గతంలో అలీని నేరుగా సీఎం జగనే తన దగ్గరకు పిలిపించుకుని మాట్లాడారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో సహా అలీ వెళ్లి జగన్ ని కలిసొచ్చారు. ఆయనకు రాజ్యసభ ఇస్తున్నారని, అత్యంత గౌరవం ఇచ్చారనే వార్తలు వినిపించాయి. అలీ కూడా రాజ్యసభ సీటు విషయంలో మౌనంగా ఉన్నారే కానీ, కొట్టిపారేయలేదు. సీఎం జగన్ కానీ, ఇతరులు కానీ త్వరలో దానపై ప్రకటన చేస్తారంటూ దాటవేశారంతా. కేనీ ఆయన సన్నిహితులు మాత్రం అలీకి జగన్ రాజ్యసభ సీటు ఆఫర్ చేశారని, కన్ఫామ్ చేశారని చెప్పుకొచ్చారు.

ఇప్పుడేమైంది..?
సామాజిక సమీకరణాల్లో అలీ పేరు మిస్ అయింది. ఉన్న నాలుగు సీట్లలో రెండు ఓసీ, రెండు బీసీలకు ఇచ్చారు జగన్. మహిళా కోటా కూడా కనపడలేదు. ఉత్తరాంధ్రనుంచి రాజ్యసభ సీటు ఆశించిన కిల్లి కృపారాణికి కూడా ఛాన్స్ మిస్ అయిందని అంటున్నారు. ఈ దశలో అలీ కూడా ఇటు నొచ్చుకున్నట్టు తెలుస్తోంది. తనకి తానుగా ఏదీ జగన్ ని అడగలేదని, వారే పిలిచి తనకు ఆఫర్ ఇచ్చారని, తీరా ఇప్పుడు వారే కాదు పొమ్మంటే తానేం చేయాలని సన్నిహితుల దగ్గర బాధపడినట్టు సమాచారం. నిజంగానే అలీ బాధపడ్డారా లేక.. ఇవన్నీ వట్టి కథనాలేనా అనేవి తేలాల్సి ఉంది. మొత్తమ్మీద అలీకి అన్యాయం జరిగిందనేది మాత్రం వాస్తవం. అలీని 2024 ఎన్నికల్లో ఉపయోగించుకోడానికే ఆయన్ను ఇలా రాజ్యసభకు పంపకుండా ఉంచారా అనేది కూడా తేలాల్సి ఉంది. 2024 ఎన్నికల్లో అలీని ప్రధాన ప్రచార సారధిగా బరిలో దింపుతారనే ప్రచారం కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: