ఒకవైపు సమ్మర్ తో ఉక్కిరిబిక్కిరి అయిన జనాలకు నిన్న మొన్నటి నుంచి వర్షాలు కురుస్తుండటం తో కాస్త ఊపిరి పీల్చుకున్నారు.. అంతలోనే మరో బాంబ్ పేలింది.ఇప్పటికీ ఏదొక వస్తువు పై ధరలు పెరుగుతూ వస్తున్నాయి.ఇప్పటికే వంట గ్యాస్ ధర భారీగా పెరిగిన విషయం తెలిసిందే..ఇప్పుడు టమోటా ధరలు కూడా ఆకాసానికి నిచ్చెనలు వేస్తున్నాయి. టమోటా ధరలు రోజు రోజుకు భారీగా పెరుగుతూ వస్తున్నాయి.అదే విధంగా నేడు మార్కెట్ లో ధరలు ఇంకాస్త పెరగడంతో జనాలు టమోటాల వైపు చూడటం మానేశారు.
 

ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలతో పాటుగా నిత్యావసర ధరలు కూడా పెరగడం, ఇప్పుడు అందులోకి టమాటో కూడా చేరడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా ఈ జాబితాలో టమోటాలు చేరాయి.సామాన్యులకు టమోటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాదులో కిలో టమాటా ధర రూ. 80 నుంచి రూ. 100 పలుకుతుంది. టమాటా సాగు తగ్గడంతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు భారీగా తగ్గాయి. అంతేకాకుండా భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడంతో మార్కెట్లో ధరలు మండుతున్నాయి..



జిల్లాలో ఈ సారి యాసంగి టమాట ఉత్పత్తి తగ్గింది. సాధారణం కంటే ఎండలు అధికంగా ఉండటంతో పూత రాక పంట తగ్గింది. దీనికి తోడు పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు, ఈదురు గాలులకు టమాట పంటకు నష్టం వాటిల్లింది. దీంతో హోల్‌సేల్‌ వ్యాపారులు చిత్తూరు జిల్లా మదనపల్లి, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి టమాటను తెప్పించి విక్రయిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో రైతులు షేడ్‌ నెట్లలో టమాటను సాగు చేస్తుంటారని, దీంతో ఎండ వేడమి నుంచి రక్షణ లభించి పంట దిగుబడి అధికంగా వస్తుందని వ్యాపారులు తెలిపారు. స్థానికంగా సరైన పంట ఉత్పత్తి లేకపోవడంతో టమాట ధరకు రెక్కలొచ్చాయి.. నెల లోపే ఈ ధర 100 కు చేరడం తో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు..ఇంకా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: