ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలకు నిరంతరాయంగా ఎలక్ట్రిసిటీ ను సరఫరా చేయనున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 9వ తేదీ నుండి కూడా పరిశ్రమలకు పవర్ హాలిడే ను విత్ డ్రా చేసుకుంది.ఇక ఈ నెల 16 వ తేదీ నుండి పరిశ్రమలకు పూర్తి స్థాయిలో విద్యుత్ ను సరపరా చేస్తామని కూడా ప్రభుత్వం తెలిపింది.దేశ వ్యాప్తంగా కూడా బొగ్గు కొరత కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించిన సంగతి తెలిసిందే.మే 9 వ తేదీ నుంచి పరిశ్రమలకు పవర్ హాలిడే విత్ డ్రా కొనసాగుతోందని ప్రభుత్వం తెలిపింది. అలాగే ఈ నెల 16వ తేదీ నుంచి కూడా పరిశ్రమలకు పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా ఇస్తున్నట్లు కూడా పేర్కొవడం జరిగింది.ఇక దేశవ్యాప్తంగా ఉన్న Coal కొరత వలన కొద్దిరోజుల పాటు పరిశ్రమలకు విద్యుత్ పంపిణీ లో సమస్యలు తలెత్తాయని ఇంకా ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడటంతో అన్ని రంగాల వినియోగదారులకు కూడా నిరంతరాయంగా విద్యుత్ ని సరఫరా చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.బొగ్గు కొరత నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశ్రమలతో పాటు గృహావసరాలకు కూడ విద్యుత్ కోతలను విధించింది.ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అవసరాన్ని బట్టి డిస్కమ్‌లు గ్రామీణ ప్రాంతాల్లో పగటిపూట 4 గంటల దాకా కరెంటు కోతలు విధించారు.



ఇక, మున్సిపల్‌ ప్రాంతాల్లో రెండు గంటలపాటు విద్యుత్‌ కోతని విధించారు. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో కరెంట్ కోతలను విధిస్తున్నారు. అయితే ఈ పవర్ కట్స్ చెబుతున్న సమయం కన్నా కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. గ్రామాలు ఇంకా పట్టణాల అన్న తేడా లేకుండా ఎడాపెడా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. కొన్ని సమయాల్లో రాత్రిపూట కూడా కరెంటు కోతలు ఎక్కువగా విధిస్తున్నారు.రాత్రివేళ గంటల తరబడి కరెంటుని కట్ చేయడంతో నరకయాతన అనుభవిస్తున్నామని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో షెడ్యూల్‌ లేని విద్యుత్ కోతల కారణంగా జనాలు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకొనే ప్రయత్నాలు కూడా చేశారు. ఇక ఈ నెల మొదటి వారంలో ఒక్క రోజు పాటు పరిశ్రమలకు పవర్ హాలిడేను ఎత్తివేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: