సాధారణంగా పాములను చూస్తే ఎవరైనా సరే వణికి పోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. రోడ్డుపై వెళ్తున్న పాము కనిపిస్తే మరోసారి అటువైపు వెళ్లడానికి కూడా భయపడిపోతుంటారు. మన కళ్ళముందు కనిపించేది విషపూరితమైన పాము కాదు అని తెలిసినప్పటికీ కూడా ఎందుకో తరిమి కొట్టేందుకు  అంత ధైర్యం చేయరు ప్రేక్షకులు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం ఏకంగా విషసర్పాలు సైతం కొంత మంది వ్యక్తులు ఎంతో అలవోకగా పట్టుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఇలా పాములు పట్టుకోవడం చూపించేందుకు యూట్యూబ్ ఛానల్ లూ కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.


 సరేగాని ప్రస్తుతం పాముల గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అని అనుకుంటున్నారు కదా.. సాధారణంగా ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి కూడా ఆహారం తినడం వాటిని విసర్జన రూపంలో బయటకు పంపించడం లాంటివి చేస్తూ ఉంటాయి. పక్షుల దగ్గర నుంచి జంతువుల వరకు కూడా మూత్రవిసర్జన మలవిసర్జన చేస్తూ ఉంటాయి అనే విషయం తెలిసిందే. కానీ  అందర్నీ భయపెట్టే పాములు మాత్రం అసలు మూత్ర విసర్జన అసలు చేయవట. ఇలా పాములు మూత్రవిసర్జన చేయకపోవడం వెనక పెద్ద కారణం దాగి ఉంది అని తెలుస్తూ ఉంది.


 పాములు శరీరావసరాలకు చాలా తక్కువ నీరు సరిపోతుందట. ఈ క్రమంలోనే మనుషులు జంతువులు లాగా ఇక అటు పాములకు చెమట కూడా పట్టదు ఈ క్రమంలోనే  జంతువు లకు అవసరం ఉన్న తక్కువ నీరు ఇతర జంతువుల లాగా ఎక్కడో ఒక చోట  కడుపు నింపు కోకుండా  పాము వేటాడిన జంతువుల శరీరంలో దాగి ఉన్న నీటిని సరిపెట్టుకుంటూ ఉంటాయట సర్పాలు ఈ క్రమంలోనే పాములకి  సర్పాలు. దీంతో నీరు  తాగాల్సిన అవసరం అస్సలు ఉండదు. ఈ క్రమంలోనే పాములు అసలు మూత్రవిసర్జన చేయవు అన్నది అర్ధమవుతుంది. ఈ విషయం తెలిసి మాత్రం అందరూ అవాక్కవుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: