ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలోని హీరోలు సైతం రాజకీయాలపై మక్కువ చూపిస్తున్నారు. సినిమాలో హీరోలుగా ఉన్న వారిపై ఒక ఫ్యాన్స్ గా చూపించే అభిమానమే రాజకీయాల్లోనూ ఉంటుందని వారు భావిస్తున్నారు. అయితే ఈ విషయంలో కొందరు చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు అని తెలిసిందే. ఇదే విధంగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గత కొంతకాలముగా రాజకీయాల్లోకి వస్తున్నారు అన్న వార్త ప్రచారంలో ఉంది. అయితే ఇందుకు వాస్తవ రూపంగా ఫ్యాన్స్ కొందరు మక్కల్ ఇయక్కం అనే పేరుతో స్థానిక ఎన్నికలో పోటీ చేయగా మంచి ఫలితాలే వచ్చాయి. అప్పటి నుండి విజయ్ రాజకీయ పార్టీ గురించి చర్చలు జరుగుతున్నాయి.

అయితే తాజాగా జరిగిన ఒక పరిణామం మరికొన్ని ఆలోచనలకు ఊతం ఇస్తోంది అని చెప్పాలి. విజయ్ టాలీవుడ్ డైరెక్టర్ వంశి పైడిపల్లి తో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైద్రాబాద్ లో జరుగుతోంది. అయితే నిన్న సాయంత్రం విజయ్ తెలంగాణ సీఎం కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలవడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకు ఈ సమయంలో విజయ్ కేసీఆర్ ను కలిశారు అన్నది ట్రేండింగ్ లో ఉంది. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో పోషించిన పాత్ర గురించి అందరికీ తెలిసిందే. అయితే విజయ్ అదే స్పూర్తితో ఒక మంచి నాయకుడు అన్న భావనతో ముందు ముందు తాను కూడా రాజకీయాల్లోకి వస్తున్నందున ఇలా తన దగ్గర సలహాలు తీసుకోవడం కోసం వచ్చిన ఉంటాడని తెలుస్తోంది.

దాదాపుగా రెండు గంటల పాటు దేశ మరియు స్థానిక రాజకీయాల గురించి ఇరువురు చర్చించుకున్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం ఈ విషయం తమిళనాట హాట్ టాపిక్ అయింది. దీనితో ఫ్యాన్స్ కూడా త్వరలో విజయ్ పెట్టబోయే రాజకీయ పార్టీ కోసం కస్టపడి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇంకెప్పుడు విజయ్ తన పార్టీని ప్రకటిస్తాడు అన్నది తెలియాల్సి ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: