ముందస్తు ఎన్నికలు..ముందస్తు ఎన్నికలు ఇదే చంద్రబాబునాయుడు మళ్ళీ మొదలుపెట్టిన జపం. పార్టీ నేతలతో చంద్రబాబు మాట్లాడుతు ఎప్పుడైనా ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందికాబట్టి అందరు రెడీగా ఉండాలన్నారు. సరే ఎన్నికలైనా, ముందస్తు ఎన్నికలైనా వస్తే పోటీచేయటం మినహా చంద్రబాబు చేసేదేముంటిది ? చంద్రబాబు అన్నట్లే ముందస్తు ఎన్నికలు వస్తున్నాయి సరే మరి పార్టీ పరిస్ధితి ఏమిటి ?






ఇక్కడే టీడీపీ పరిస్దితిపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. అర్జంటుగా చంద్రబాబు చేయాల్సిందేమంటే జగన్మోహన్ రెడ్డిపై బురదచల్లటం నిలిపేయాలి. ఎందుకంటే ముందు 175 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్ధులను రెడీచేసుకోవాలి కాబట్టి. తనలోని ఎనర్జీనంతా జగన్ను తిట్టడానికే ఖర్చుచేసేస్తే ఇక నేతలతో సమీక్షలు, అభ్యర్ధుల ఎంపిక కసరత్తు, జిల్లాల వారీగా నేతలతో సమావేశాలు, ఆశావహుల వడపోత, అభ్యర్ధుల ఎంపిక లాంటిపనులకు ఎనర్జీ ఎక్కడినుండి వస్తుంది ?  పైగా పొత్తులుంటాయని ఒకసారి ఇంకా తేల్చుకోలేదని మరోసారి నాటకాలు ఆడుతున్నారు. 






ఎందుకింత అర్జంటు అంటే పార్టీకి సుమారు 100 నియోజకవర్గాల్లో ఇన్చార్జీలే లేరట. ఇన్చార్జీలే లేనపుడు ఇక గట్టి అభ్యర్ధులు ఎక్కడ దొరుకుతారు. అసలు మూడేళ్ళుగా 100 నియోజకవర్గాల్లో ఇన్చార్జీలను చంద్రబాబు ఎందుకు వేయలేదు ? పోనీ ఇన్చార్జీలున్న నియోజకవర్గాల్లో అయినా పార్టీ యాక్టివ్ గా ఉందా అంటే అదీలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని స్వయంగా చంద్రబాబు ఇచ్చిన పిలుపును కూడా చాలామంది నేతలు పట్టించుకోవటంలేదు.






కాబట్టి రేపటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులను రెడీచేసుకునే విషయంలో ముందు చంద్రబాబు దృష్టిపెట్టకపోతో కష్టమే. అలాగే పొత్తులంటున్నారు. జనసేనతోనా లేకపోతే బీజేపీతో కూడా కలిపే పొత్తులా అనేది తేల్చుకోవాలి. జనసేనతో మాత్రమే పొత్తుంటె ఒకలెక్క, బీజేపీ కూడా కలిస్తే మరోలెక్క. పొత్తులు పెట్టుకున్నపుడు ఇవ్వాల్సిన సీట్లు, నియోజకవర్గాలపై చంద్రబాబు అర్జంటుగా కసరత్తు చేయాలి. పై అంశాలపై అత్యవసరంగా దృష్టిపెట్టకపోతే మరో ఐదేళ్ళు ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సొస్తుంది. కాబట్టి ముందస్తు..ముందస్తనే జపం మానేసి తాను చేయాల్సిన పనిపై  చంద్రబాబు దృష్టిపెడితే బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: