ఇక మోటారు వాహనాల చట్టం ప్రకారం.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ని ధరించాలి. లేకపోతే జరిమానాని విధిస్తారు. అయితే హెల్మెట్ ధరించినా  కూడా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే అవకాశం ఉంది. దీనివల్ల రూ.2000 ట్రాఫిక్ చలాన్ అనేది పడుతుంది. ఇక ఆ వివరాలేంటో తెలుసుకుందాం..మోటారు వాహనాల చట్టం ప్రకారం ఒక రైడర్ మోటార్‌సైకిల్ లేదా స్కూటర్‌ను నడుపుతున్నప్పుడు హెల్మెట్ స్ట్రిప్ ని కనుక ధరించకపోతే రూల్ 194D MVA ప్రకారం అతనికి రూ.1000 చలాన్ విధిస్తారు.అలాగే నాసిరకం హెల్మెట్ ధరించి ఉన్నట్లు గుర్తించినా.. లేదా BIS రిజిస్ట్రేషన్ లేకపోయినా కూడా ఆ రైడర్‌కు 194D MVA ప్రకారం మరో రూ.1000 చలాన్‌ విధిస్తారు.ఇక బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) సర్టిఫైడ్ హెల్మెట్‌లను మాత్రమే అమ్మాలని రెండేళ్ల క్రితం కేంద్రం ఆదేశించింది. ఇక సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. రోడ్డు భద్రతపై కమిటీ మార్చి 2018లో దేశంలో తేలికైన హెల్మెట్‌లను కూడా సిఫార్సు చేసింది. దీంతోపాటు బీఐఎస్‌ సర్టిఫైడ్‌ కూడా తప్పనిసరి చేసింది.



అలాగే రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ద్విచక్ర వాహనాలపై తీసుకెళ్లడానికి భద్రతా నియమాలను కూడా సరిచేసంది.అలాగే కొత్త ట్రాఫిక్ రూల్స్ ప్రకారం.. రైడర్స్ తప్పనిసరిగా హెల్మెట్ ఇంకా పిల్లలకు బెల్ట్‌లను ఉపయోగించాలి. అలాగే వెహికల్‌ వేగాన్ని కూడా కేవలం 40 కిమీకి పరిమితం చేసింది. కొత్త ట్రాఫిక్ నియమాన్ని కనుక ఉల్లంఘిస్తే 1,000 జరిమానా ఇంకా మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ ని విధిస్తారు.ఇక ఒకవేళ సిగ్నల్స్ (రెడ్ లైట్‌) క్రాస్‌ చేయడం, ఓవర్ రైడింగ్ ఇంకా ఎదురుగా రావడం.. ఇంకా పలు ట్రాఫిక్ నిబంధనలను కనుక ఉల్లంఘిస్తే.. రూ. 2,000 జరిమానాని విధిస్తారు.ఇక అలాంటి సమయాల్లో రూ.20వేలు ఫైన్‌ కట్టాలి.ఇక మోటార్‌సైకిల్‌ దారులకు పైన పేర్కొన్న ఉల్లంఘనలు కాకుండా..ఇంకా వాహనాన్ని ఓవర్‌లోడ్ చేసినందుకు రూ.20,000 భారీ జరిమానాను ఎదుర్కోవలసి ఉంటుంది.ఇక ఇలాంటి సమయంలో టన్నుకు రూ.2,000 అదనపు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: