151 ఎమ్మెల్యేల బలం ఉంది. టీడీపీ, జనసేన నుంచి ఇప్పటికే 5గురు ఎమ్మెల్యేలు వైసీపీవైపు వచ్చారు. జగన్ గ్రీన్ సిగ్నల్ కోసం ఇంకొంతమంది వెయిట్ చేస్తున్నారని అంటారు. ఈ దశలో జగన్ కి కొత్తగా వచ్చినవారితో తలనొప్పులు మొదలయ్యాయి. అందులోనూ గన్నవరం నియోజకవర్గ పంచాయితీ ఎంతకీ తెగట్లేదు. గన్నవరంలో టీడీపీ నుంచి వచ్చిన వల్లభనేని వంశీని స్థానిక గ్రూపులు దగ్గరకు రానీయడంలేదు. దీంతో వారితో వంశీకి గొడవలు మొదలయ్యాయి. చివరకు అవి సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు చేరాయి.

టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వల్లభనేని వంశీకి, అప్పటికే అక్కడ ఉన్న వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు మధ్య కొంతకాలంగా గ్రూప్ తగాదాలు ఉన్నాయి. గతంలో ఓసారి సీఎం జగన్ వీరిద్దరినీ కలిపారు. చేతిలో చేయి వేసి ఇకపై సఖ్యతగా ఉండాలని చెప్పారు. కానీ ఆయన మాట ఎవరూ వినలేదు. ఇటీవల కొంతకాలంగా వారి మధ్య ఉన్న గ్రూపు రాజకీయాలు పెచ్చుమీరాయి. ఈ విషయం మరోసారి సీఎం జగన్ వద్దకు వెళ్లింది. దీంతో ఈ వ్యవహారం త్వరగా తేల్చాలని పార్టీ సీనియర్లకు చెప్పారు జగన్. ఇటీవల నెల్లూరుజిల్లాలో కాకాణి, అనిల్ మధ్య కూడా ఇలాగే సయోధ్య చర్చలు పెట్టారు. ఇప్పుడు మరోసారి గన్నవరం విషయంలో కూడా అలాంటి చర్చలకు సిద్ధమయ్యారు. వల్లభనేని వంశీ, దుట్టా రామచంద్రరావుని తాడేపల్లికి పిలిపించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎంవో అధికారులు.. నాయకులిద్దరితో సమావేశమయ్యారు. గన్నవరంలో ఏం జరుగుతుందో ఆరా తీశారు.

తెగని పంచాయితీ..
అయితే చర్చల తర్వాత కూడా ఫలితం లేదని దుట్టా రామచంద్రరావు మాటల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. తమను సజ్జల, ధనుంజయ్ రెడ్డి.. ఇ్దదరూ తాడేపల్లికి పిలిపించారన్నారు దుట్టా. గన్నవరం నియోజకవర్గంలో జరుగుతున్న విషయాలను అడిగారని, తాము ఉన్నవి ఉన్నట్టు చెప్పామని తెలిపారు. దుట్టా అల్లుడు మీద ఇటీవల వంశీ వర్గం ఆరోపణలు చేస్తోంది. దీంతో మట్టి తవ్వకాల గురించి దుట్టా వర్గం ఏకంగా కలెక్టర్ కి ఫిర్యాదు చేసింది. అధికార పార్టీలోనే ఇలా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడంతో అదికారులు తలలు పట్టుకున్నారు. దీంతో వ్యవహారం అధిష్టానం వద్దకు చేరింది. తాము చెప్పాల్సింది చెప్పామని, మరోసారి చర్చలు ఉంటాయని చెప్పారని అన్నారు దుట్టా. అంటే ప్రస్తుతానికి ఈ పంచాయితీ తెగలేదని అర్థమవుతోంది. మరోసారి పిలిపించేలోపు స్థానికంగా ఎలాంటి పరిణామాలుంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: