హీరో, జనసేనాని పవర్ స్టార్ పవణ్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరో వైపు ప్రజల సమస్యల ను కూడా తెలుసుకోనే ప్రయత్నం చేస్తున్నాడు. రోడ్ షోలు నిర్వహిస్తూ, ప్రజలకు, రైతన్నలకు మద్దతు ఇస్తూన్నాడు. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని రోజులుగా రోడ్డు షో లతో పవణ్ కళ్యాణ్ బిజీగా ఉన్నాడు.ఇందులో భాగంగా శుక్రవారం ఆయన మీడియా తో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓట్లు చీలనివ్వకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తానని పవన్ స్పష్టం చేశారు.
 

రాజధాని విషయం లో బీజేపీ అధినాయకత్వాన్ని ఒప్పించినట్లే. ఓట్ల చీలిక విషయంలోనూ బీజేపీ హైకమాండ్‌ ను ఒప్పించే ప్రయత్నం చేస్తానని పవన్ కల్యాణ్ వెల్లడించారు. కాపులు మద్దతు వైసీపికి వుంటుందని ఆ పార్టీ నాయకులు విర్రవీగుతూ , ధీమాను వ్యక్తం చెస్తున్నారు.. కాపు సామాజిక వర్గం ఓటర్లు తమను రాజకీయంగా ఏం చేయలేరనే భావన లో వైసీపీ వుందని ఆయన ఎద్దేవా చేశారు. కాపు సామాజిక వర్గాన్ని వైసీపీ చాలా తేలిగ్గా తీసుకుంది. వైసిపి ప్రభుత్వం రిజర్వేషన్లు ఇవ్వలేమని జగన్ చేతులు ఎత్తెసారని పవన్ కళ్యాణ్ చురకలు అంటించారు.


ఇప్పటికే అప్పు పుట్టని పరిస్ధితి లోకి రాష్ట్రాన్ని తీసుకెళ్లారని పవన్ మండిపడ్డారు. ఏపీ ఆర్ధిక పరిస్ధితి పై కేంద్రానికి పూర్తి అవగాహన వుందన్నారు. తెలంగాణ లో 30 స్థానాల్లో పోటీ చేసే బలం జనసేనకు వుందని పవన్ తెలిపారు. తెలంగాణ లో 15 స్థానాల్లో జనసేన విజయం సాధిస్తుందని ఆయన స్పష్టం చేశారు.ఎక్కడ పోటీ చేసినా తనను ఓడిస్తామన్న వైసీపీ నేతల ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నానని పవన్ తెలిపారు. ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలవుతాయని, తనను విమర్శించిన మాజీ మంత్రులకు ఇప్పటికైనా తెలిసుండాలని ఆయన చురకలు వేశారు. వైసిపి ప్రభుత్వం ఆటలు ఇంకా సాగవని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: