సాధారణంగా బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కొంతమంది వినూత్నంగా ప్రయత్నించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. ఇటీవలి కాలంలో అయితే కొంతమంది ట్రెండ్ ని బాగా ఫాలో అవుతూ తమ బిజినెస్ ను పెంచుకోవడానికి కొత్త దారులు వెతుకుతూనే ఉన్నారు. ఇక ఇటీవల పెట్రోల్ బంక్ సిబ్బంది కూడా  ఇలా వినూత్నమైన ఆలోచన చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.



 ప్రస్తుతం దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎంతలో పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో సామాన్య ప్రజలు అందరూ కూడా బెంబేలెత్తిపోతున్నారు. అత్యవసరం అయితే తప్ప వాహనాన్ని బయటకు తీయడం లేదు అని చెప్పాలి. ఇక ఇలాంటి సమయంలోనే   ఒక్క రూపాయి పెట్రోల్ తక్కువగా వచ్చినా చాలు అని ఆశ పడుతున్నారు సామాన్య ప్రజలు. ఈ క్రమంలోనే ఇదే క్యాష్ చేసుకోవాలని భావించారు పెట్రోల్ బంక్ సిబ్బంది.  ఇతర పెట్రోల్ బంకుల కంటే తమ వద్ద పెట్రోల్ తక్కువ ధరకే దొరుకుతుంది అనే విషయాన్ని అందరికీ తెలియజేయాలి అని భావించారు.


 ఇక ఇది ఎలా చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో ఒక వినూత్నమైన ఆలోచన తో ముందుకు వచ్చారు. ఏకంగా ఎస్సార్ పెట్రోల్ బంక్ అంటే మా వద్ద రెండు రూపాయలు తక్కువకే పెట్రోల్ దొరుకుతుంది అంటూ హెచ్ పి  పెట్రోల్ బంక్ వారు ఒక కటౌట్ ఏర్పాటు చేశారు.  దీంతో చిర్రెత్తిన ఎస్ఆర్ పెట్రోల్ బంక్ సిబ్బంది హెచ్పి పెట్రోల్ బంక్ ముందే అన్ని కంపెనీల కంటే తమ దగ్గర 2.40 రూపాయలకు తక్కువ దొరుకుతుంది  అంటూ ఒక బోర్డు ఏర్పాటు చేశారు. ఈ ఘటన కడపలోని వెలుగులోకి వచ్చింది. అయితే వీరి మధ్య పోటీ మాత్రం వాహనదారులకు వరంగా  మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: