ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మొదట సిఎం అయిన నాయకుడిగా వైఎస్ జగన్ ప్రత్యేక గుర్తింపును పొందారు. అంతే కాకుండా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడిగా మమకారం మరియు ఆయన హామీలను నమ్మిన ప్రజలు ఆయనకు మెజారిటీ ఓట్లు వేసి గెలిపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యదిక సీట్లను అందుకునేలా చేసి పట్టం కట్టారు. అయితే చెప్పిన మాట ప్రకారమే, ఇచ్చిన హామీలు ప్రకారమే సీఎం జగన్ ఒక్కొక్కటిగా తన హామీలను కాగితంపై నుండి అమలు లోకి వచ్చేలా చేశారు. నిజం చెప్పాలంటే అజెండా లో లేని ఎన్నో పథకాలను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే అభివృద్ధి అనేది మాత్రం జరగడం లేదని, కనపడటం లేదని అన్ని వైపులా నుండి వినపడుతోంది.

అయినా తన పని తాను చేసుకుంటూ వీలైనంతలో ప్రజలకు ఎన్నో ప్రతిష్టాత్మక పథకాలను అందిస్తూ వాటిని కొనసాగిస్తూ పాలన కొనసాగిస్తున్నారు జగన్. ఇలా ఏపి సిఎం జగన్ తీసుకొచ్చిన పథకాలలో ఒకటి అమ్మఒడి. స్కూల్స్ వెళ్ళే విద్యార్దులకు ఈ పథకం ద్వారా ఏటా రూ.15,000 ప్రభుత్వం నుండి అందుతుంది. అయితే కుటుంబం లోని ఒక బిడ్డకి మాత్రమే ఇది చెల్లుతుంది. విద్యార్థి యొక్క తల్లి బ్యాంక్ ఖాతాలో ఈ మొత్తం నేరుగా జమ అయ్యేలా రూపొందించడం జరిగింది.  కాగా వైసిపి ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటి నుండి ఈ పథకం అందుబాటులో ఉండగా... ఇప్పటికే మరుగు దొడ్ల నిర్వహణ పేరిట రూ.1000 కట్ చేయగా.. ఇప్పుడు పాఠశాల మౌలిక సదుపాయాల నిర్వహణకు మరో రూ. 1000 తగ్గించేందుకు జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం సిద్ధమౌవుతోంది అని వార్తలు వినపడుతున్నాయి.

కాగ ఈ క్రమంలో గతంలో ఈ పథకం ద్వారా విద్యార్దులకు అందాల్సిన రూ,15000 లో నుండి రూ.1000 కోతను విధించి రూ.14,000 అందిస్తుండగా....ప్రస్తుతం మరో వెయ్యి రూపాయలు కోత పడింది అని సమాచారం. దాంతో రూ. 14000 కాస్త రూ.13000 కు చేరి అందనుందని సమాచారం. ఈ పథకం కింద రానున్న జూన్‌ లో ఈ ఏడాది కి గాను రూ.13 వేలు మాత్రమే విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు సమాచారం. ఇలా లబ్ది దారుల నుంచి మినహాయించిన నగదు మొత్తాన్ని పాఠశాల విద్యా శాఖ ద్వారా పాఠశాలల నిర్వహణకు కేటాయిస్తారు. ఈ సమాచారాన్ని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధిదకారులు ఇప్పటికే.. జిల్లా స్థాయి అధికారులకు తెలియచేశారు.
కాగా ఇపుడు ఈ నెల నుంచే ఇది అమలు అయ్యే ఛాన్స్ ఉన్నట్లు రాజకీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. మరి ఏం జరుగుతుంది అన్నది చూడాలి. దీనితో ప్రజలు జగన్ సారూ సంవత్సరానికి వెయ్యి చొప్పున కోత విధిస్తే ఇంకేమి మిగులుతుంది మాకు అంటూ ఆవేదన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: