ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మంచి కాక మీద ఉన్నాయి. తమ పార్టీ అధికారంలోకి రావడం ఏమో కానీ వైసిపి పార్టీ మాత్రం మరో సారి అధికారం లోకి రాకుండా గద్దె దించాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. అందుకు ఒక పార్టీ మరొక పార్టీ తో ముడిపడయినా సరే..మరింత బలం పుంజుకుని రాబోయే ఎన్నికల్లో విజృంభించాలి అని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మాట నిజమే అన్నట్లుగా తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. ఏపిలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా బీజేపీని సైతం ఒప్పిస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధ్యక్షుడు పవన్.

తాజాగా  మీడియాతో సంభాషించిన  పవన్ తన మనసులో ఉన్న భావాలను క్లియర్ గా బయట పెట్టేశారు. వచ్చే ఎన్నికల్లో తమతో పాటు తెలుగుదేశం పార్టీని కూడా కలుపుకుని వెళతామని... బీజీపని ఒప్పించి మరి టిడిపిని కలుపుకుని సిద్దం అవుతామని అన్నారు.  నిజానికి ఇక్కడే పవన్ పప్పులో కాలేస్తున్నారు అంటున్నారు కొందరు రాజకీయ నేతలు. పవన్ అజ్ఞానం ఇక్కడే కనపడుతోంది అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా తమతో టీడీపీని కలుపుకున్నంత మాత్రాన ఎన్నికల్లో తిరుగులేని విజయం లభించదు. ఎందుకంటే ప్రతిపక్షాలుగా కాంగ్రెస్ వామపక్షాలు కూడా ఉన్నాయన్న విషయం కాస్త గుర్తుపెట్టుకుంటే విషయం ముందే అర్దం అయ్యి ఉండేది అని అంటున్నారు .

రాజకీయాలలో ప్రతిపక్షాల్లో దేనిబలం ఎంతని విశ్లేషిస్తే  ప్రాంతాలను బట్టి ఇవి భిన్నంగా ఉన్నాయి. ఒక్కోచోట ఒక్కో పార్టీ బలంగా ఉంటుంది. అయితే ఏపిలో అయితే   బీజేపీ కాంగ్రెస్ వామపక్షాల బలం సున్నాయే అని చెప్పాలి.  మొన్నటి ఎన్నికల జనసేన బలం 5.6 శాతంగా తేటతెల్లమైంది. ఇదే ఓట్లశాతం వచ్చే ఎన్నికల్లో కూడా రిపీట్ అవుతుందా అన్నది కూడా కనీసం ఊహించలేము. అమాంతం పెరగొచ్చు లేదా అన్నది కూడా పోవచ్చు. ఇక టీడీపీ బలం తీసుకుంటే సుమారు 35 శాతం వరకు ఉంటుంది అన్నది అంచనా.. ఇది ఇలాగే వచ్చే ఎన్నికల్లోనూ కొనసాగే అవకాశం  ఉంది.  అయితే  టీడీపీతో పొత్తుకు బీజేపీ నేతలు కొంచం కూడా మొగ్గు చూపని పరిస్థితుల్లో పవన్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.  చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాలనే నిర్ణయాన్ని తీసుకోవాల్సింది నరేంద్రమోడీ గారి వల్ల  మాత్రమే జరిగే పని.

మరింత సమాచారం తెలుసుకోండి: