జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు తెలంగాణాలో రాజకీయం చేయాలంటే ఎంత భయమో తాజాగా బయటపడింది. తెలంగాణా గడ్డమీద నుండి తెలంగాణా రాజకీయాలగురించి ప్రకటన చేయటానికి కూడా భయపడిపోయారు. శుక్రవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్ మండలంలో పర్యటించారు. ఆ సమయంలో మీడియాతో తెలంగాణా రాజకీయాల గురించి మాట్లాడుతు ఏపీలోనే అధికారాన్ని ఆశించటంలేదు ఇక తెలంగాణాలో అధికారాన్ని ఏమాశిస్తాం అని అన్నారు.





అంటే ఎవరికైనా ఏమర్ధమవుతుంది ? తెలంగాణా రాజకీయాల్లో జనసేనకు పెద్ద ఆసక్తి లేదన్న అర్ధమే వినిపిస్తుంది. పైగా తాను వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని, కొత్త నాయకత్వం రాజకీయాల్లోకి రావాల్సుంది అని ప్రకటనచేశారు. తమకు ప్రతి నియోజకవర్గంలో 5, 6 వేల ఓట్లుంటుందని మాత్రం చెప్పారు. ఓ 20 శాతం సీట్లలోనో లేకపోతే మూడోవంతు సీట్లలో పోటీచేయాలనే ఆలోచనుందన్నారు. ఇంకా ఏ విషయం డిసైడ్ కాలేదని చెప్పారు.





సీన్ కట్ చేస్తే రాత్రికి మంగళగిరి పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు. మీడియాతో మాట్లాడుతు తెలంగాణాలో తాము 30 సీట్లలో బలంగా ఉన్నట్లు చెప్పారు. కచ్చితంగా 15 సీట్లలో గెలుస్తామని చెప్పారు. పొత్తు పెట్టుకుని తెలంగాణా ఎన్నికల్లో పోటీచేస్తామని ప్రకటించారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే తెలంగాణా పర్యటనలో ఉన్నపుడు తెలంగాణా రాజకీయాలగురించి, పోటీగురించి అడిగినపుడు పెద్దగా ఆసక్తిలేదన్నట్లు మాట్లాడారు.





అదే ఏపీలోకి వచ్చేటప్పటికి తెలంగాణా ఎన్నికలు, పోటీ, గెలుపవకాశాల గురించి స్పష్టంగా చెప్పారు. తెలంగాణా రాజకీయాలగురించి, పోటీగురించి తెలంగాణా పర్యటనలో ఎందుకని మాట్లాడలేదు ? రాత్రికి ఏపీకి చేరుకోగానే తెలంగాణా రాజకీయాలు, పోటీగురించి ఎందుకు మాట్లాడారు ? ఉదయం తెలంగాణాలో పర్యటనకు, రాత్రి ఏపీలో అడుగుపెట్టేదానికి మద్య ఏమి జరిగింది ? వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకమని చెబుతున్న పవన్ తెలంగాణాలో టీఆర్ఎస్, ఏపీలో టీడీపీ గురించి మాత్రం ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ? అంటే పవన్ దృష్టిలో వైసీపీ తప్ప ఈ రెండుపార్టీలు వారసత్వ పార్టీలుగా కనిపించటంలేదా ?



మరింత సమాచారం తెలుసుకోండి: