ఆదివారం వస్తే చాలా మందికి ముక్క లేనిది ముద్ద దిగదు.ఇక ఈరోజు చాలా హోటల్స్ జనాలను ఆకట్టుకోవడానికి మరిన్ని ఆఫర్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు..ముఖ్యంగా బిర్యాని, నాన్ వెజ్ ఐటమ్స్ లపై భారీ ఆఫర్ ను అందిస్తున్నారు..అరేబియన్‌ మండీ బిర్యానీ పేరు వినే ఉంటారు.ఒకప్పుడు టవున్ కు మాత్రమే పరిమితం అయిన ఈ బిర్యాని ఇప్పుడు పల్లెల్లో కూడా ఫెమస్ అవుతుంది.హైదరాబాద్‌ బిర్యాని అనే వాళ్లంతా ఇప్పుడు అరబ్‌ వంటకమైన మండీ బిర్యానీపై మనసు పారేసుకుంటున్నారు. దీంతో నాగర్‌కర్నూల్‌ జిల్లా వ్యాప్తంగా ఈ మండీ హోటల్స్‌ పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి.


సాధారణంగా హోటల్‌కు వెళ్లి ఎవరి ప్లేట్‌లో వారు అన్నం తినడం సహజం. కాని ఐదారుగురు వ్యక్తులు ఒకే ప్లేట్‌లో భోజనం చేయడం ఈ మండీ ప్రత్యేకత. ఇలా ఏ హోటల్‌లో చూసినా ఇదే కనిపిస్తుంది. నలుగురైదుగురు స్నేహితులు ఫ్యామిలీ మెంబర్స్‌ గ్రూప్‌గా వచ్చి అందరూ కలిసి ఒకే ప్లేట్‌లో ఆరగిస్తూ ఎంజాయ్‌ చేస్తుంటారు. ధరలు సాధారణ బిర్యానీలకు కాస్త అటూ ఇటు గానే ఉంటున్నాయి. ఒక్క ప్లేట్‌లో నలుగురు సంపూర్ణంగా తినవచ్చు..మాంసం ఉడికించిన నీటిలోనే బియ్యాన్ని ఉడికించడం ఈ మండీ ప్రత్యేకత. మొదటగా మటన్‌, చికెన్‌ ముక్కలను పెద్ద పరిమాణంలో కట్‌ చేస్తారు. అనంతరం మాంసం ముక్కలకు తక్కువ మోతాదులో పచ్చి మిరపకాల మిశ్రమం, ఉప్పు, జైతూన్‌ ఆకు, పాలు, ధనియాలు, దాల్చన చెక్క, జాఫ్రాన్, జాపత్రి మిశ్రమాలను కలిపి గంట పాటు ఉంచుతారు.


అనంతరం నీటిలో వేసి ఉడికిస్తారు. ఇలా ఉడికిన అనంతరం మాంసం బయటికి తీసి ఆ నీటిలోనే బియ్యం వేసి ఉడికిస్తారు.ఇలా అన్నీ రకాలు వేసి బిర్యానిని తయారు చేస్తారు.మండీ బిర్యానీ పూర్తిగా పోషక విలువలు కలిగిన ఆహారం. సాధారణ బిర్యానీలో ఉండే మసాల కారణంగా తరచూ ఆరగించే వారికి కొవ్వు పెరిగి వ్యాధుల బారిన పడుతుండడం సహజం. ఇదే విషయమై వైద్యులు కూడా హెచ్చరిస్తుంటారు. ఈ మండీ బిర్యానీ పూర్తి భిన్నం. ఇందులో ఎలాంటి మసాల వస్తువులు లేకపోవడంతో పాటు బాదం, పిస్తా, చిరంజీ, కిస్‌మిస్‌ తదితర డ్రై ఫ్రూట్స్‌ ను కూడా వేస్తారు.ఆ ఫ్లెవర్స్ బాగా ఉండటంతో ఇప్పుడు పల్లెల్లో కూడా బాగా ఫెమస్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: