దూరమైపోయిన బీసీలను మళ్ళీ దగ్గరకు చేర్చుకునేందుకు చంద్రబాబునాయుడు పెద్ద ప్లానే వేసినట్లున్నారు. ఇంతకీ ఆ ప్లాన్ ఏమిటంటే వైసీపీ తరపున రాజ్యసభ కు నామినేట్ అయిన ఆర్ కృష్ణయ్యను ఏపీలో బూచిగా చూపించటం. అలాగే జగన్మోహన్ రెడ్డిపైకి రాష్ట్రంలోని బీసీలందరినీ రెచ్చగొట్టి గొడవలు చేయించటం. ఇలాంటి వ్యూహాలతో మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి దగ్గరైన బీసీలను మళ్ళీ దూరంచేసి టీడీపీకి దగ్గర చేసుకోవచ్చని చంద్రబాబు ప్లాన్ చేశారు.





వైసీపీ తరపున రాజ్యసభకు వెళ్ళే నలుగురిలో తెలంగాణాకు చెందిన బీసీ హక్కుల ఉద్యమనేత కృష్ణయ్య కూడా ఉన్న విషయం తెలిసిందే. కృష్ణయ్యను పార్టీ తరపున రాజ్యసభకు ఎంపికచేయటంలో జగన్ వ్యూహం ఏమిటో ? ఆలోచన ఏమిటో ఎవరికీ తెలీదు. కృష్ణయ్య వల్ల రాష్ట్రంలోని బీసీలు వైసీపీకి మద్దతుగా నిలబడతారా లేదా అన్న విషయంలో కూడా క్లారిటిలేదు. అయితే ఈ విషయంలో చంద్రబాబు మాత్రం బాగా రెచ్చిపోతున్నారు.





కృష్ణయ్యకు జగన్ రాజ్యసభ ఎంపీ ఇవ్వటాన్ని ఒకవైపు తట్టుకోలేకపోతున్నారు. అలాగే రాష్ట్రంలో బీసీనేతలు ఎవరు లేరా అంటు నిలదీస్తున్నారు. రాష్ట్రంలో బీసీలు ఎవరు లేనట్లు తెలంగాణా వ్యక్తి కృష్ణయ్యకు ఇవ్వటాన్ని చద్రబాబు తప్పుపడుతున్నారు. అసలు తనహయాంలో ఒక్క బీసీకి కూడా చంద్రబాబు రాజ్యసభ ఇవ్వని విషయాన్ని మరచిపోయారు.  రాష్ట్రంలోని బీసీ నేతలను, ఇటు జగన్ పైకి అటు కృష్ణయ్యపైకి రెచ్చగొడుతున్నారు.






తన వ్యూహం వర్కవుటవుతుందని బీసీలంతా జగన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తారని, మళ్ళీ టీడీపీకి దగ్గరవుతారని చాలా పెద్ద ప్లానులోనే ఉన్నారు చంద్రబాబు. అధికారంలో ఉన్నపుడు తమకోసం చంద్రబాబు చేసిందేమిటి ? ఇపుడు జగన్ చేస్తున్నదేమిటి అన్న విషయాన్ని బీసీలు భేరీజు వేసుకోకుండానే ఉంటారా ? బీసీలకు చంద్రబాబు చేసిందేమిటి ? తమ ప్రభుత్వం చేస్తున్నదేమిటి అనే విషయాలను రాష్ట్రమంతా తిరిగి చెప్పాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులు ఈనెల 26వ తేదీనుండి బస్సుయాత్రకు రెడీ అవుతున్నారు. ఈ విషయం కూడా చంద్రబాబును కలవరపాటుకు గురిచేసుంటుంది. అందుకనే బీసీలను రెచ్చగొడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: