దేశ ప్రజలకు చల్లని కబురు..ఎండలకు బాధ పడుతున్న వారందరికీ  వ్యాప్థంగా వానలు కురుస్తున్నాయని వెల్లడించింది..రానున్న ఐదు రోజుల్లో భారత దేశంలోని ఉత్తర, తూర్పు రాష్ట్రాలతోపాటు, ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది. ముఖ్యంగా ఈరోజు అధిక శాతం వర్షం కురుస్తోందని తెలిపింది. రాయలసీమ ప్రాంతంలో ఏర్పడ్డ సైక్లోన్ కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.ఇది జనాలకు ఊరట కలిగించే విషయం అనే చెప్పాలి.


బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఈదురు గాలులు, ఉరుములు, పిడుగులు కూడా ఉండే అవకాశం ఉంది. ఎండల తో అట్టుడికిన రాజస్థాన్‌ లో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గాయి. కేరళ, త్రిపుర, మేఘాలయల్లో నూ వర్షాలు కురుస్తాయి. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అసోం, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, పశ్చిమ బెంగాల్‌లో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఐదు రోజులు వర్షాలు కురవనున్నాయని అంచనా వేస్తున్నారు..


భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ ఏడాది మొదటి నైరుతి రుతుపవనాలు ఈ నెల 27న కేరళ లోకి ప్రవేశించే అవకాశం ఉంది. సాధారణంగా రుతుపవనా లు ప్రవేశించే గడువు కంటే ఈసారి ఐదు రోజులు ముందుగానే వస్తున్నాయని దాని వల్ల దేశంలో భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాలకు కొన్ని రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుసున్నాయి.. భారీ వర్షాల కారణంగా భారీ వరదల తో జనాలు ఇబ్బందులు పడుతున్నారు.. మరో వైపు కొన్ని రాష్ట్రాల లో చేతికి వచ్చిన పంట నీట మునగడం తో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక రానున్న వర్షాలు ఎలాంటి ప్రభావాలను చూపిస్తుందొ అని భయపడుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: