అదృష్టం అనేది ఎప్పుడో కానీ తలుపుతట్టదు. ఆ తట్టిన నాడు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా వదిలిపెట్టి పోదు. మిగతా అంశాల్లో ఎలా ఉన్నా కానీ బెట్టింగ్ వంటి విషయాల్లో మాత్రం అదృష్టం ఉంటేనే ధనలక్ష్మి కరుణిస్తుంది.ఇక ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వహించిన ఓ నిరుపేద కశ్మీర్ వ్యక్తి రాత్రికి రాత్రే పెద్ద కోటీశ్వరుడయ్యాడు. దక్షిణ కాశ్మీర్ లోని బిజ్ బెహరా ప్రాంతానికి చెందిన యువకుడు ఆన్ లైన్ ఫాంటసీ క్రికెట్ ప్లాట్ ఫామ్ “డ్రీమ్ 11″లో మొత్తం రూ.2 కోట్లు గెలుచుకోవడం ద్వారా రాత్రికి రాత్రే మిలియనీర్ అయ్యాడు.ఇక జమ్ముకశ్మీర్లోని అనంత్ నాగ్ జిల్లాలోని షల్గామ్ గ్రామానికి చెందిన వసీం రజా “డ్రీమ్ 11″లో రూ.2 కోట్లు డబ్బుని గెలుపొందారు. ఈసందర్భంగా వసీం మాట్లాడుతూ శనివారం నాడు రాత్రి తాను నిద్రపోతున్నానని, ఇక కొంతమంది స్నేహితులు తనకు ఫోన్ చేసి డ్రీమ్ 11లో మొదటి స్థానంలో ఉన్నానని చెప్పారని, ఆ తర్వాత తాను రూ.2 కోట్లు గెలుచుకున్నాననే విషయాన్నీ గ్రహించానని ఆయన మీడియాతో చెప్పారు.ఇక ఈ వార్త బయటకు రావడంతో, స్థానికులు, స్నేహితులు వసీంను అతని కుటుంబ సభ్యులను అభినందించడం స్టార్ట్ చేశారు.



 “డ్రీమ్ 11″ ప్లాట్ ఫామ్ లో గత రెండు సంవత్సరాలుగా ఐపీఎల్ ఫాంటసీ జట్లను సృష్టించడం ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నానన్న వసీం రజా..రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని కావడం అనేది తనకి ఒక కలలా అనిపించిందని అన్నారు. ఆర్థికంగా బలహీన వర్గానికి చెందిన తాము ఇకపై మా పేదరికాన్ని అధిగమించడానికి ఈ డబ్బు సహాయపడుతుందని అన్నారు.ఇక రూ. 2 కోట్లు నగదు గెలుపొందడంపై ఆనందం వ్యక్తం చేసిన వసీం, గత కొన్ని రోజులుగా తన తల్లి గారు అనారోగ్యంతో ఉందని, ఇప్పుడు ఆమెకు వెంటనే చికిత్స చేయిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. వసీం రజాను అభినందించే వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇక “డ్రీమ్ 11” అనేది ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ ఫామ్. మొబైల్ లో ఫాంటసీ క్రికెట్, హాకీ, ఫుట్ బాల్, కబడ్డీ ఇంకా అలాగే బాస్కెట్ బాల్ వంటి ఆటలు ఆడొచ్చు. ఏప్రిల్ 2019లో యునికార్న్ హోదా సాధించిన ఫస్ట్ భారతీయ గేమింగ్ కంపెనీగా డ్రీమ్ 11 అవతరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: