రాజకీయం అన్నాక అన్నీ ఉంటాయి. కులాలు మతాలు అన్నీ కలిసే ఉంటాయి. అయితే విజయాన్ని సాధించాలంటే ఎన్నో సమీకరణాలు లెక్కలోకి వస్తాయి. అయితే ఒక నాయకుడు లేదా ఒక రాజకీయ పార్టీ నెగ్గుకురావాలంటే ఖచ్చితంగా ఇవన్నీ పరిగణలోకి తీసుకుని అందరినీ కలుపుకుంటూ పోతేనే విజయం వరిస్తుంది. అయితే కొన్ని సార్లు ఇవే కొందరి పతనానికి కారణం అవుతుంటాయి. అందుకే కుల మత సమీకరణాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చర్చకు వస్తోంది అంటే... ఏపీలో జనసేన పార్టీకి మెగా ఫ్యాన్స్ అంతా ఒక చోట సమావేశమై మద్దతు ఇవ్వడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలా జరిగితే నిజంగా జనసేనకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది.

ఇప్పుడు ఇదే ఒకరకంగా మైనస్ గా మారే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే... ఇక్కడ ఒకరి ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్ గా వేరే హీరో ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. ఒక్క మెగా హీరో ఫ్యాన్స్ కన్నా మిగిలిన హీరోల ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ఫ్యాన్స్ గోల ఒకటి అయితే, కులాల గోల మరొకటి. ఆలా చూసుకుంటే టీడీపీ కి జూనియర్ ఎన్టీఆర్ మరియు బాలయ్య ఫ్యాన్స్ ఉన్నారు...వీళ్లంతా టీడీపీకి తమ ఓట్లను వేస్తారు. అప్పుడు మెగా ఫ్యాన్స్ VS నందమూరి ఫ్యాన్స్ గా మారిపోతుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ చెబుతున్న పొత్తు కథ కుదరదు కదా ? ఏ విషయం జనసేనకు మైనస్ గా మారదా ? ఖచ్చితంగా మైనస్ అని చెప్పాలి.

ఇక ఫ్యాన్స్ కనుక రంగంలోకి దిగితే వారి దూకుడుకు తట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి ఈ మెగా ఫ్యాన్స్ మద్దతు వ్యూహం మాత్రం దెబ్బతినేలా ఉంది. ఈ విషయంలో జనసేన మరోసారి ఆలోచించుకుంటే బేషుగ్గా ఉంటుంది. ఇప్పుడు పొత్తు ఎవరితో వెళుతుంది అనేది కంఫర్మ్ చేసుకుని దానికి తగిన ప్రణాళిక చేసుకుంటేనే ఉపయోగకరం లేదంటే మొదటికే మోసం వస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: