మంత్రి విశ్వరూప్ ఇంటిపైకి ఆందోళనకారులు దాడిచేశారు. ఇంట్లో ఉన్న మూడుకార్లకు నిప్పుపెట్టారు. జిల్లా ఎస్పీపైకి రాళ్ళతో దాడి చేశారు. 20 మంది పోలీసులను రాళ్ళతో కొట్టారు. రెండు ఆర్టీసీ బస్సులను తగలబెట్టారు. మూడు ప్రైవేటు బస్సులకు నిప్పుపెట్టారు. మంత్రి క్యాంపు కార్యాలయాన్ని కూడా తగలబెట్టారు. ఇదంతా ఎక్కడ జరిగిందని అనుకుంటున్నారా ? కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ గా మార్చటంతో తలెత్తిన శాంతిభద్రతల సమస్య.





ఈమధ్యనే ప్రభుత్వం జిల్లాల పునర్వవ్యవస్ధీకరణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మూడు జిల్లాలుగా విభజన జరిగిన తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ జిల్లాకూడా ఒకటి. కోనసీమ జిల్లా విషయంలో రెండు డిమాండ్లు వినిపిస్తోంది. మొదటిదేమో బాలయోగి పేరు పెట్టాలని. ఇక రెండో డిమాండ్ ఏమో అంబేద్కర్ జిల్లాగా మార్చాలని. ఇదే విషయమై అన్నీ పార్టీల నేతలతో అభిప్రాయాలను ప్రభుత్వం సేకరించింది.





అంబేద్కర్ సంఘాలు, దళిత సంఘాలతో పాటు అనేక వర్గాల ప్రజలతో చర్చల తర్వాతే ప్రభుత్వం కోనసీమ జిల్లాను కోనసీమ అంబేద్కర్ జిల్లాగా మార్చింది. అయితే కొందరు మాత్రం అంబేద్కర్ జిల్లాగ వద్దని కోనసీమ జిల్లాగా మాత్రమే మార్చాలనే డిమాండ్లు మొదలయ్యాయి. వారంరోజులుగా వినిపిస్తున్న డిమాండ్లు ఒక్కసారిగా మంగళవారం హింసాత్మకంగా మారింది. కుటుంబసభ్యులతో మంత్రి విశ్వరూప్ ఇంట్లో ఉండగానే ఆందోళనకారులు ఒక్కసారిగా దాడిచేశారు. ఇంట్లోని ఫర్నీచర్ ను ధ్వంసంచేయటంతో పాటు ఇంట్లో నిప్పుపెట్టారు.






జరుగుతున్నది చూస్తుంటే మామూలు ఆందోళనకారులు చేసిందని ఎవరు అనుకోవటంలేదు. ఎందుకంటే ఉభయగోదావరి జిల్లాల్లో ఎస్సీలు ఎక్కువ. అంబేద్కర్ జిల్లాగా పేరు పెడితే స్వాగతిస్తారే కానీ ఎవరు వ్యతిరేకించరు. అలాంటిది ఒక్కసారిగా ఇంతటి హింసకు పాల్పడ్డారంటేనే ప్రభుత్వం అంటే గిట్టని వారే చెశారని అర్ధమైపోతోంది. హింసకు పాల్పడినవాళ్ళెవరన్నదే ఇక్కడ ప్రశ్నగా మారింది. మంత్రి ఇంటితో పాటు మరో ముమ్మడివరం ఎంఎల్ఏ పొన్నాడ సతీష్ ఇంటిపైన కూడా ఆందోళనకారులు దగ్ధంచేశారు. అంటే అసాంఘీకశక్తులే ఇలాంటి హింసకు పాల్పడినట్లు అర్ధమైపోతోంది. ప్రీప్లాన్డ్ గానే ఆందోళనకారుల్లో అసాంఘీక శక్తులు కలిసిపోయే ఇంతటి విధ్వంసానికి పాల్పడ్డారు.  ప్రభుత్వం వెంటనే మేల్కొనకపోతే జిల్లాకు తీవ్రనష్టం జరిగే ప్రమాదముంది.


మరింత సమాచారం తెలుసుకోండి: