మాటమాట్లాడితే దుష్టచతుష్టయమంటారు, ఎల్లీమీడియా అంటారు. ప్రజలు ఆ ఎల్లోమీడియాను నమ్మద్దంటారు. ఇదే విషయాన్ని మంత్రులు, పార్టీ నేతల సమావేశాల్లో కూడా చెబుతారు. మనం పోరాడుతున్నది చంద్రబాబునాయుడుతోనే కాదు దుష్టచతుష్టయంతో కూడా అంటు సదరు మీడియా అధిపతుల పేర్లను కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. ఒకవైపు ఎల్లోమీడియాలో వచ్చేదంతా అబద్ధాలే అని మండిపోతునే మళ్ళీ అందులోని ఒక దినపత్రికకు (పేరు చెప్పక్కర్లేదు ) మాత్రం రెగ్యులర్ గా ప్రకటనలిస్తున్నారు.





సదరు దినపత్రికలో వచ్చే వార్తలను, కథనాలను చదవద్దు, నమ్మద్దంటునే మళ్ళీ అదే దినపత్రికకు ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్లను ఎందుకు ఇవ్వాలి ? వార్తలు, కథనాలను నమ్మద్దని చెబుతున్నారంటేనే దానికి విశ్వసనీయత లేదని స్వయంగా జగనే చెబుతున్నారు. మరి విశ్వసనీయత లేని దినపత్రికకు ప్రభుత్వం ప్రకటనలు మాత్రం ఎందుకివ్వాలి ? లార్జెస్టు సర్క్యులేటెడ్ డైలీ కాబట్టి ప్రకటనలు ఇచ్చి తీరాలని అనుకోవటమూ తప్పే.





ఎలాగంటే 24 గంటలూ, 365 రోజులూ  ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్దేశ్యపూర్వకంగా కథనాలు, వార్తలు  రాస్తున్న దినపత్రికలకు ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాల్సిన అవసరంలేదు. పత్రికలంటే ప్రభుత్వానికి భజనే చేయాలని ఏమీలేదు. అయితే తప్పును తప్పుగాను ఒప్పును ఒప్పుగాను రాయాల్సుంటంది. ప్రభుత్వం చేసే మంచిపనుల్లో కూడా రంద్రాన్వేషణ చేసి నెగిటివ్ గా మాత్రమే కథనాలు, వార్తలు రాయటానికి అలవాటుపడిపోయిన దినప్రతికలకు ఎంత సర్క్యులేషన్ ఉన్నా ప్రకటనలు ఇవ్వక్కర్లేదు.





ప్రకటనలు ఇవ్వకపోతే మహా అయితే ఆ యాజమాన్యం కోర్టును ఆశ్రయిస్తుంది. యాజమాన్యం కోర్టులో కేసు వేస్తే మొత్తం వ్యవహారం బయటపడుతుంది. సదరు దినపత్రిక అచ్చేస్తున్న కథనాలు, వార్తలు అన్నీ కోర్టు పరిశీలనకు వస్తాయి.  కోర్టు విచారణలో అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సదరు దినపత్రిక ఇస్తున్న కథనాలు, వార్తల మెరిట్ ఏమిటో అందరికీ తెలుస్తుంది. అయినా జగన్ సదరు దినపత్రికకు రెగ్యులర్ గా కోట్లరూపాయల విలువైన ప్రకటనలిస్తున్నారు ఎందుకిస్తున్నట్లు ? ఎందుకంటే ఆ దినపత్రికంటే జగన్ భయపడుతున్నట్లే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: